న్యూఢిల్లీ: వారణాసిలోని జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో సర్వే చేయడానికి కోర్టు కమిషనర్‌ను నియమించడాన్ని సమర్థిస్తూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ జ్ఞానవాపి మసీదు కమిటీ దాఖలు చేసిన పిటిషన్‌పై అక్టోబర్ మొదటి వారంలో విచారణ చేపడతామని సుప్రీంకోర్టు గురువారం తెలిపింది. జ్ఞానవాపి మసీదులో లభించినట్లు చెబుతున్న శివలింగానికి పూజలు చేయడానికి అనుమతించాలని కోరుతూ దాఖలైన రెండు రిట్ పిటిషన్లను విచారణకు స్వీకరించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. హిందూ భక్తులు దాఖలు చేసిన సివిల్ వ్యాజ్యం విచారణార్హతపై అభ్యంతరాలు లేవనెత్తుతూ జానవాపి మసీదు కమిటీ వాసిన పిటిషన్‌పై వారణాసి జిల్లా న్యాయమూర్తి ఇంకా నిర్ణయం తీసుకోవలసి ఉందని, ఆ నిర్ణయం కోసం ఎదురుచూస్తామని జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ పిఎస్ నరసింహతో కూడిన డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది.
జ్ఞానవాపి పిటిషన్‌పై అక్టోబర్‌లో సుప్రీం విచారణ
- Advertisement -
- Advertisement -
- Advertisement -