Thursday, January 23, 2025

సాగునీటి ప్రాజెక్టులపై కేంద్రానికి సుప్రీం కీలక ఆదేశాలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంలోని సాగు నీటి ప్రాజెక్టులను కెఆర్‌ఎంబి పరిధిలోకి తీసుకొచ్చే అంశంపై ఆగస్టు 20లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. అనుమతులు లేకుండా శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాలను విద్యుత్ ఉత్పత్తి సహా ఇతర అవసరాలకు వాడేస్తున్నారంటూ ఎపి ప్రభుత్వం గతంలో దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ జరిపింది.

ప్రాజెక్టులను కెఆర్‌ఎంబి పరిధిలోకి తేవాలని ఎపి సర్కార్ కోరుతుండగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు నిరాకరిస్తోంది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సిన నేపథ్యంలో నోటిఫికేషన్ జారీకి కొన్ని సాంకేతిక కారణాలు ఉన్నాయని అదనపు సొలిసిటర్ జనరల్ ధర్మాసనం దృష్టికి తెచ్చారు. కేంద్రం నుంచి తగిన సూచనలు తీసుకోవాల్సి ఉందన్నారు. ఈ క్రమంలో తదుపరి విచారణను సుప్రీంకోర్టు ఆగస్టు 20కి వాయిదా వేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News