Sunday, December 22, 2024

శాసనసభ సీట్ల పెంపుపై సుప్రీం నోటీసులు

- Advertisement -
- Advertisement -

Supreme Notices on Increase in Legislative Assembly Seats

తెలుగు రాష్ట్రాల్లో శాసనసభ సీట్లపై వేసిన రిట్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ

మనతెలంగాణ/ హైదరాబాద్: ఉభయ తెలుగు రాష్ట్రాల శాసన సభ సీట్లపై వేసిన రిట్ పిటిషన్‌పై సోమవారం సుప్రీంకోర్టు విచారణ జరిపింది. తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్థానాలను 119 నుంచి 153కు, ఎపిలో 175 నుంచి 225కు,పెంచాలని పర్యావరణ నిపుణుడు ప్రొఫెసర్ కె. పురుషోత్తంరెడ్డి సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేశారు. విభజన చట్టం నిబంధనలు అమలుచేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు తెలంగాణ, ఎపి, కేంద్రం, ఎన్నికల సంఘాన్ని ప్రతివాదులుగా చేర్చారు. విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం.. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. జమ్ముకశ్మీర్ నియోజకవర్గాల పిటిషన్‌కు జత చేయాలని రిజిస్ట్రీకి ఆదేశించింది. సుప్రీంకోర్టు రిజిస్ట్రీకి జస్టిస్ జోసఫ్, జస్టిస్ హృషికేశ్ రాయ్ ధర్మాసనం ఈ ఆదేశం పంపింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News