Saturday, November 16, 2024

బ్రాహ్మణేతర అర్చకులు.. స్టాలిన్ సర్కారుకు సుప్రీం నోటీసులు

- Advertisement -
- Advertisement -

Supreme Court notice to centre and Gujarat govt

ఢిల్లీ/చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్‌కు ఎదురుదెబ్బ తగిలేలా కనిపిస్తోంది. ఆలయాల్లో బ్రాహ్మణేతరులను అర్చకులుగా నియమిస్తూ ఇచ్చిన ఆదేశాలకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌పై సుప్రీం కోర్టులో సోమవారం విచారణ జరిగింది. ఈ పిటిషన్ ఆధారంగా నియామకాలపై వివరణ కోరుతూ స్టాలిన్ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. బీజేపీ నేత సుబ్రమణియన్ స్వామి ఈ మేరకు సుప్రీం కోర్టులో స్టాలిన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేశారు. ఆలయాలను ప్రభుత్వ ఆధీనం లోకి తీసుకోవడం, బ్రాహ్మణేతరులను ఆలయ అర్చకులుగా నియమించడం లాంటి స్టాలిన్ ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ స్వామి ఈ పిటిషన్ వేశారు.

తమిళనాడులో డీఎంకె అధికారం లోకి రాగానే ఎన్నికల హామీలో భాగంగా ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అన్ని కులాల వాళ్లను ఆలయ అర్చకులుగా నియమిస్తామని మాటిచ్చారు. ఈమేరకు అర్చక శిక్షణ తీసుకున్న పలువురిని కిందటేడాది ఆగస్టులో అర్చకులుగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో హిందూ రెలిజియన్ అండ్ చారిటబుల్ ఎండోమెంట్ విభాగం సుమారు 208 మందికి అర్చక ఉద్యోగ నియామక పత్రాలు అందించింది. అయితే ఈ నియామకాలపై బీజేపీ నేత స్వామి తీవ్ర అభ్యంరాలు వ్యక్తం చేవారు. తండ్రి కరుణానిధి లాగే తనయుడు స్టాలిన్ కూడా ఆలయ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నాడని, దీనిపై కోర్టుకు వెళ్తానని హెచ్చరించారు. ఈమేరకు స్టాలిన్ ఆయన తండ్రిలా ఆలయాల విషయంలో తప్పులు చేయరనే అనుకుంటున్నా. స్టాలిన్ 2014లో సభనాయాగర్ నటరాజ్ ఆలయం విషయంలో సుప్రీం కోర్టు నుంచి చీవాట్లు తిన్న విషయం మర్చిపోయారేమో… ఇప్పుడు ఆలయాల అర్చకుల విషయంలో తప్పు చేస్తుంటే ఊరుకోను. కోర్టుకు వెళ్లాల్సివస్తే … వెళ్తానంటూ కిందటి ఏడాది ఆగస్టులో స్వామి ఓ ట్వీట్ కూడా చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News