Monday, January 20, 2025

అవినాశ్ మధ్యంతర బెయిల్‌పై సుప్రీం స్టే

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో ఎంపి అవినాశ్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్‌పై సుప్రీంకోర్టు స్టే విధించింది. సునీతా రెడ్డి పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టిన అనంతరం తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ప్రతివాది ఎంపి అవినాశ్ రెడ్డికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. సోమవారం అన్ని విషయాలు పరిశీలిస్తామని సుప్రీం కోర్టు వివరించింది. 25 వరకు అవినాశ్‌ను అరెస్ట్ చేయవద్దని హైకోర్టు మధ్యంతర తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. తెలంగాణ హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టులో సునీత సవాల్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News