Saturday, November 16, 2024

డాక్టర్లకు సుప్రీంకోర్టు అల్టిమేటం

- Advertisement -
- Advertisement -

రేపు సాయంత్రం 5.00 గంటలకల్లా హాజరు కావాలి!

న్యూఢిల్లీ: కోల్‌కతాకు చెందిన వైద్యురాలిపై అత్యాచారం, హత్య కేసు ఘటనపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా సిబిఐ కేసు దర్యాప్తునకు సంబంధించిన స్టేటస్‌ రిపోర్ట్‌ ను సమర్పించింది. అదే సమయంలో బెంగాల్‌ ప్రభుత్వం సైతం రిపోర్టును కోర్టుకు సమర్పించింది.

వైద్యులు విధులకు హాజరుకాకపోవడంతో 23 మంది ప్రాణాలు కోల్పోయారని బెంగాల్‌ ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ తెలిపారు. ఆ తర్వాత సిబిఐ కొత్త స్టేటస్‌ రిపోర్టును సమర్పించాలని సిజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్‌ మనోజ్ మిశ్రా ధర్మాసనం ఆదేశించింది. విచారణను ఈ నెల 17వ తేదీకి వాయిదా వేసింది. అనంతరం విచారణ సందర్భంగా వైద్యులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. విధులకు వచ్చిన వైద్యులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది. అయితే, ఇంకా వైద్యులు మంగళవారం సాయంత్రం 5గంటల్లోగా విధులకు హాజరుకావాలని ఆదేశించింది.

నిరంతరాయంగా విధులకు గైర్హాజరయితే వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవచ్చని చెప్పింది. కేసు విచారణ సందర్భంగా సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతాను ఆర్‌జీ మెడికల్‌ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్‌ నివాసం, ఆసుపత్రికి మధ్య దూరాన్ని సిజెఐ అడిగి తెలుసుకున్నారు. దీనికి మెహతా స్పందిస్తూ సుమారు 15 నుంచి 20 నిమిషాల ప్రయాణం ఉంటుందని తెలిపారు.

వైద్యురాలు మనందరికీ కూతురులాంటిదని.. ఈ కేసులో దోషులను వీలైనంత త్వరగా శిక్షించాలని సొలిసిటర్‌ జనరల్‌ కోరారు. విచారణ సందర్భంగా అసహజ మరణ రిపోర్ట్‌ ను దాఖలు చేసే సమయంపై సుప్రీంకోర్టు వివరణ కోరింది. ఈ సందర్భంగా సిసిటివి ఫుటేజీ, సిబిఐకి అందించిన ఆధారాలపై సైతం ధర్మాసనం వివరాలు అడిగి తెలుసుకున్నది. కోల్‌కతా ప్రభుత్వం ఇచ్చిన నమూనాలను ఎయిమ్స్‌, ఇతర కేంద్ర ఫోరెన్సిక్‌ ల్యాబొరేటరీలకు పంపాలని సిబిఐ నిర్ణయించిందని ఎస్‌జి మెహతా ధర్మాసనానికి తెలిపారు. పోస్ట్ మార్టం నివేదికపై మరో న్యాయవాది ప్రశ్నలు లేవనెత్తారు. వెజినల్‌ స్వాబ్‌ నాలుగు డిగ్రీల సెల్సియస్‌ వద్ద భద్రపరచాలని… కానీ అలా చేయలేదన్నారు.

పోస్టుమార్టం రిపోర్టులో ఎప్పుడు పోస్టుమార్టం చేశారన్న ప్రస్తావన లేదని సొలిసిటర్‌ జనరల్‌ చెప్పారు. అత్యాచారం, హత్య కేసులో మొదటి ఐదుగంటలు కీలకమని ఎస్‌జి మెహతా పేర్కొన్నారు. ఘటన జరిగిన ఐదురోజుల తర్వాత విచారణ చేపట్టిన సిబిఐకి ఎన్నో సవాళ్లు ఉన్నాయన్నారు. కాగా దర్యాప్తుపై కొత్త స్టేటస్‌ రిపోర్ట్‌ను సమర్పించాలని సీబీఐ కోర్టును ఆదేశించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News