Monday, January 20, 2025

సుప్రియా సూలెపై సునేత్ర పవార్ పోటీ ?

- Advertisement -
- Advertisement -

బారామతి : మహారాష్ట్రలో శరద్ పవార్‌కు బలమైన స్థావరంగా పరిగణిస్తున్న బారామతిలో పట్టణ వ్యాప్తంగా గడచిన కొన్ని రోజులుగా ఆడియో విజువల్ పబ్లిక్ అడ్రెస్ సిస్టమ్‌తో ఒక వాహనం తిరుగుతోంది. ఆ వాహనంపై సునేత్ర పవార్, ఆమె భర్త అజిత్ పవార్ పోస్టర్లు ఉన్నాయి. రానున్న లోక్‌సభ ఎన్నికలలో ఆమెను బారామతి నుంచి బరిలోకి దింపవచ్చుననే ఊహాగానాలకు అవి ఊతం ఇస్తున్నాయి. తన సమీప బంధువు, ఎంపి సుప్రియా సూలేపై ఒక అభ్యర్థిని నిలబెట్టగలమని అజిత్ పవార్ శుక్రవారం సంకేతాలు వదిలినప్పటి నుంచి ఆ ఊహాగానాలు మరింత పెరిగాయి.

అయితే, అభ్యర్థి పేరును అజిత్ పవార్ వెల్లడించలేదు. కానీ, ‘మీ భావి తరాల సంక్షేమార్థం’ పాటుపడగల ‘తొలిసారి అభ్యర్థి’ని ఎన్నుకోవలసిందిగా బారామతిలో వోటర్లకు ఆయన భావోద్వేగంతో కూడిన విజ్ఞప్తి చేశారు. శనివారం ఆయన భార్య సునేత్ర పవార్ పోస్టర్లు అనేకం నియోజకవర్గంలో కానవచ్చాయి. పవార్ కుటుంబానికి, సుప్రియా సూలేకి ఐదు దశాబ్దాలకు పైగా బారామతి బలమైన స్థావరంగా ఉంటున్నది. అయితే, తన పెద్దనాన్న శరద్ పవార్‌పై అజిత్ పవార్ తిరుగుబాటు చేసి ఎన్‌సిపిని చీల్చడంతో సార్వత్రిక ఎన్నికలలో పవార్ కుటుంబం మధ్య గట్టి పోటీని బారామతి చూడవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News