Tuesday, January 7, 2025

15-20 రోజుల్లో కుట్రదారుల గుట్టు రట్టు: సూరజ్ రేవణ్ణ

- Advertisement -
- Advertisement -

మైసూరు(కర్నాటక): తనపైన, తన కుటుంబంపైన కుట్ర చేసినవారి గుట్టు 15-20 రోజుల్లో బయటపడుతుందని లైంగిక దాడి ఆరోపణలతో జైలుకు వెళ్లి బెయిల్‌పై విడుదలైన జెడిఎస్ ఎంఎల్‌సి సూరజ్ రేవణ్ణ తెలిపారు. తాను ఏ తప్పూ చేయలేదని, త్వరలోనే నిజం బయటకు వస్తుందని ఆయన అన్నారు.

శుక్రవారం మైసూరులోని చాముండేశ్వరి అమ్మవారి ఆలయాన్ని సందర్శించిన అనంతరం సూరజ్ విలేకరులతో మాట్లాడారు. తాము ఏ తప్పూ చేయలేదని, అందుకే తాము తామంతా ధీమాగా ఉన్నామని ఆయన చెప్పారు. అన్ని ప్రశ్నలకు సమాధానం లభిస్తుందని, కాలమే అన్నిటికీ సమాధానం ఇస్తుందని మాజీ ప్రధాని దేవెగౌడ మనవడైన సూరజ్ వ్యాఖ్యానించారు.

నిజాన్ని ఎంతోకాలం దాచలేరని, తమపై కుట్రలో పాలుపంచుకున్నవారందరూ త్వరలోనే బయటకు వస్తారని, ఒక్క 15 నుంచి 20 రోజులు వేచి ఉండాలని ఆయన విలేకరులకు చెప్పారు. ప్రతి సంవత్సరం తన కుటుంబ సభ్యులతో కలసి చాముండేశ్వరి అమ్మవారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోందని సూరజ్ చెప్పారు. లైంగిక దాడి కేసులో సూరజ్ రేవణ్ణకు రెండు రోజుల క్రితమే బెయిల్ లభించగా ఆయన సోదరుడు మాజీ ఎంపి ప్రజ్వల్ రేవణ్ణ మరో లైంగిక దాడి కేసులో జైలులో ఉన్నారు. వారి తల్లిదండ్రులు హెచ్‌డి రేవణ్ణ, భవానీ రేవణ్ణ కూడా ఒక మహిళను కిడ్నాప్ చేసినట్లు నమోదైన కేసులో బెయిల్ పొందారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News