Sunday, January 5, 2025

అమవాస్య నాడు సూరజ్ రేవణ్ణ ఎర్రచీర కట్టుకొని…. నల్లగాజులు వేసుకొని… అలా

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: ఓ యువకుడిపై ఎంఎల్‌సి సూరజ్ రేవణ్ణ అత్యాచార ఆరోపణల కేసులో విస్తుగొలిపే విషయాలు పోలీసుల విచారణలో వెలుగులోకి వస్తున్నాయి. ఓ యువకుడిపై అత్యాచారానికి పాల్పడిన ఆరోపణలపై సూరజ్ రేవణ్ణ అరెస్టైన విషయం తెలిసిందే. అమావాస్య రోజుల్లో సూరజ్ ఎర్రచీర కట్టుకొని, నల్లగాజులు ధరించేవాడని సిఐడి విచారణలో తేలింది. 2019 ఎన్నికల సమయంలో ఓ యువకుడికి అరకలగూడలో సూరజ్ పరిచయం కావడంతో తన ఫోన్ నంబర్ తీసుకొని విజిటింగ్ కార్డు ఇచ్చాడు. ఫోన్ లో సదరు యువకుడికి గుడ్ మార్నింగ్‌తో పాటు పలుమార్లు ప్రేమ చిహ్నాలు పంపించేవాడు. ఒక రోజు సూరజ్ తన ఫామ్‌హౌస్‌కు ఆ యువకుడిని పిలిపించుకొని కాళ్లు ఒత్తమని కోరాడు. అనంతరం సూరజ్ బెదిరించి తనపై అత్యాచారం చేశాడని సిఐడి అధికారులకు యువకుడు తెలిపాడు. ఎర్రచీర, నల్లగాజులు వేసుకున్న ఫోటోలు ఆయన ఫోన్ లో ఉన్నాయని సదరు యువకుడు పోలీసుల విచారణలో వెల్లడించారు. ఆ ఫోన్ కోసం పోలీసులు వెతుకుతున్నారు.

2018లో సాగరిక అనే అమ్మాయిని సూరజ్ పెళ్లి చేసుకున్నాడు. భార్యను అసహజ లైంగిక కార్యకలాపాలు చేయాలని సూరజ్ బలవంతం చేశాడు. దీంతో భార్య అతడి నుంచి విడాకులు తీసుకుందని న్యాయవాది కుమార్ ఎ పాటిల్ తెలిపారు. పెళ్లి జరిగిన కొన్ని నెలల దంపతులు విడాకులు తీసుకున్నట్టు సమాచారం.  పలువురు మహిళలపై లైంగిక దాడి చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న జెడిఎస్ ఎంపి ప్రజ్వల్ రేవణ్ణ అరెస్టు ఐనా విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News