Monday, December 23, 2024

సూరక్క జీవితం ఆదర్శనీయం

- Advertisement -
- Advertisement -

స‌త్తుప‌ల్లి: ప్రజలే చరిత్ర నిర్మాతలనే దానికి బాసారం భూ పోరాట ఉద్యమ నిర్మాత మచ్చా సూరమ్మ ఉద్యమ జీవితం ప్రతీకగా ఉందని సిపిఐ (ఎంఎల్) ప్రజా పంథా జిల్లా కార్యదర్శి గోకినేపల్లి వెంకటేశ్వర రావు అన్నారు. సత్తుపల్లి మండల ప్రజాపంథా సీనియర్ నాయకురాలు మచ్చా సూరమ్మ అకాల మరణం పొందారు. అంత్యక్రియల సందర్భంగా కొమ్ముగూడెం గ్రామంలో ఏర్పాటు చేసిన సంతాప సభకు పార్టీ డివిజన్ నాయకులు ఎ. శరత్ అధ్యక్షత న జరిగిన సభలో గోకినేపల్లి వెంకటేశ్వర రావు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో పేదలందరనీ సమీకరించి వేలాది ఎకరాలు పోడుకొట్టించి బాసార గ్రామ నిర్మాణంలో సురక్క క్రియాశీల పాత్ర పోషించిందని కొనియాడారు.

భూ పోరాటంలో ఆమె అనేక కేసులను, పోలీసు నిర్బంధాల్ని ఎదుర్కొందన్నారు. ప్రజాపంథా పార్టీ అభివృద్ధిలో ఆమె కృషిని మాట్లాడిన పార్టీ నాయకులు ప్రశంసించారు. ఆమె కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని తెలియజేశారు. నిరక్షరాస్యురాలైన ఆదివాసి మహిళ సూరమ్మ జీవితంలో పాటించిన విలువలను ఈ తరం యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ డివిజన్ కార్యదర్శి ఎ.వెంకన్న, జిల్లా నాయకులు అమర్లపుడి రాము, గంటా శ్రీను, బీరెల్లి లాజరు, పౌర హక్కుల సంఘం నాయకులు కూకలకుంట రవి, కాటినేని శ్రీనివాసరావు, పార్టీ నాయకులు తాటి రాజు, ఒగ్గు నాగిరెడ్డి, కొర్సా వెంకటేష్, కందిమళ్ల నాగ ప్రసాద్, సున్నం రాజారావు, సున్నం కృష్ణ, గుండు పోలయ్య, మహిళా సంఘ నాయకులు జి.లలిత, కారం సంధ్య , పాండ్ల దుర్గ, తాటి దేవి, వెంకటనర్శమ్మ, యువజన సంఘ నాయకులు కొమరం రమేష్, మొడియం రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News