Monday, December 23, 2024

పొదుపు ఖాతాదారులకు సురక్ష యోజన

- Advertisement -
- Advertisement -

సిటీ బ్యూరో: ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి సురక్ష యోజన పథకాన్ని ఖాతాదారులందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ రాంనగర్ శాఖ మేనేజర్ పూర్ణిమ సూచించారు. పొదుపు ఖాతాదారులు రూ. 330లు చెల్లించడం ద్వారా సురక్ష యోజన పొందవచ్చునని చెప్పారు. అనారోగ్య కారణాలతో మరణించిన సూరి సంధ్య కుటుంబ సభ్యులకు రూ.2లక్షల రెండుచెక్‌ను ఆమె శనివారం అందజేశారు. పిఎంజెజెఎస్‌వై పథకంలో భాగంగా రాంనగర్ శాఖలో మొదటి పరిహారం మొత్తాన్ని సంధ్య భర్త సంతోష్‌కు అందజేసామని మేనేజర్ పూర్ణిమ తెలిపారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ ఆఫీసర్ గణేష్ కుమార్, ఐశ్వర్య, వినోద , బ్యాంక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News