Sunday, January 19, 2025

ఒడిశా అసెంబ్లీ స్పీకర్ గా సురామ పాధి

- Advertisement -
- Advertisement -

ఆ పదవికి రెండో మహిళగా రికార్డు

భువనేశ్వర్: ఒడిశా అసెంబ్లీ స్పీకర్ గా బిజెపి సీనియర్ నేత సురామ పాధి ఎన్నికయ్యారు. ఆమె ఏకగ్రీవంగా ఎన్నికయినట్లు ప్రొటెం స్పీకర్ ఆర్ పి స్వెన్ ప్రకటించారు. ఒడిశా అసెంబ్లీ స్పీకర్ గా ప్రమీలా మల్లిక్ తర్వాత ఈమె ఆ పదవికి ఎన్నికైన రెండో మహిళా స్పీకర్ గా రికార్డు సృష్టించారు.

ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి, ఉపముఖ్యమంత్రులు కెవి. సింగ్ డియో, ప్రవతి పరిదా, ప్రతిపక్ష నాయకుడు నవీన్ పట్నాయక్, ఇతర సభ్యులు ఈ సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. సురామ పాధి తనకు అవకాశాన్ని కల్పించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. సభా గౌరవాన్ని కాపాడేందుకు కృషి చేస్తానన్నారు. ఆమె నయాగఢ్ జిల్లాలోని రాన్ పూర్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి రెండు సార్లు ఎంఎల్ఏగా ఎన్నికయ్యారు. 2004లో నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బిజెడి-బిజెపి కూటమి ప్రభుత్వంలో సహకార మంత్రిగా పనిచేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News