Monday, January 20, 2025

సూరారం ఎస్సై సస్పెండ్

- Advertisement -
- Advertisement -

ఓ కేసు దర్యాప్తు సరిగా చేయలేదని సూరారం పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న ఎస్సైని సస్పెండ్ చేస్తూ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి ఆదేశాలు జారీ చేశారు. సూరారం పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా పనిచేస్తున్న నారాయణ్ సింగ్ తన పరిధిలో నమోదైన కేసులో సరిగా దర్యాప్తు చేయలేదని మేడ్చల్ డిసిపి నితికాపంత్ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతికి రిపోర్టు పంపింది. దానిని ఆధారంగా చేసుకుని విధుల పట్ల నిర్లక్షంగా వ్యవహరించిన ఎస్సై నారాయణ్‌సింగ్‌ను సస్పెండ్ చేస్తూ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News