Monday, January 20, 2025

విరాట్‌కు వజ్రాల బ్యాట్….

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : టీమిండియా మాజీ కెప్టెన్, పరుగుల యంత్రం విరాట్ కోహ్లీకి ఉన్న క్రేజే వేరు. ప్రస్తుతం హాలీడేస్ ఎంజాయ్ చేస్తున్న విరాట్ ఇటివల 15 ఏళ్ల క్రికెట్ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నాడు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఓ అభిమాని కోహ్లీకి వజ్రాలు పొదిగిన బ్యాట్‌ను గిఫ్ట్‌గా ఇచ్చాడు. సూరత్ చెందిన ఓ వ్యాపారవేత్త దాదాపు 10 లక్షల రూపాయల విలువచేసే ఈ వజ్రాల బ్యాట్‌ను 1.05 కారెట్ల ఒరిజినల్ డైమండ్స్‌తో 15 మి.మి పొడవుతో తయారు చేయించి కింగ్ కోహ్లీకి అందజేయనున్నాడట. కాగా, ఈ బ్యాట్ ఇప్పుడు సర్టిఫికేషన్ కోసం పంపినట్లు ఆ తయారీ కంపెనీ యాజమాన్యం పేర్కొంది. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న విరాట్ త్వరలోనే శ్రీలంకలో జరిగే ఆసియా కప్‌లో ఆడేందుకు బయలేదేరనున్నాడు. అనంతరం సవ్దేశంలో జరిగే వన్డే సిరీస్, 2023 వరల్డ్ కప్ టోర్నీలో ఆడనున్నాడు.

Also Read: జగిత్యాలలో యువకుడు దారుణ హత్య

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News