Sunday, January 19, 2025

ఇస్రో సైంటిస్టునని నమ్మించిన వ్యక్తి అరెస్ట్

- Advertisement -
- Advertisement -

సూరత్: ఇస్రో శాస్త్రవేత్తనని, చంద్రయాన్3 మిషన్ కు ల్యాండర్ మాడ్యూల్ డిజైన్ చేసింది తానేనని నమ్మించిన కపట సైంటిస్టును గుజరాత్ లోని సూరత్ సిటీ పోలీస్‌లు మంగళవారం అరెస్టు చేశారు. ఆగస్టు 24న చంద్రయాన్3 మిషన్ విజయవంతం అయిన దగ్గర నుంచి నిందితుడు మితుల్ త్రివేదీ స్థానిక మీడియాకు ఇంటర్వూలు ఇవ్వడం మొదలు పెట్టాడు. ల్యాండర్ మాడ్యూల్‌ను తానే రూపొందించానని చెప్పుకొచ్చాడు. ఇస్రో కు చెందిన ఏన్షియంట్ సైన్స్ అప్లికేషన్ డిపార్టుమెంట్ అసిస్టెంట్ ఛైర్మన్‌గా పనిచేస్తున్నానని నమ్మ బలికాడు.

ఈమేరకు 2022 ఫిబ్రవరి 26 తేదీతో బోగస్ అపాయింట్‌మెంట్ లెటర్ చూపించేవాడు. దీనిపై ఫిర్యాదులు అందడంతో పోలీస్‌లు దర్యాప్తు చేపట్టారు. ఇస్రోకు ఆయనకు ఎలాంటి సంబంధం లేదని బట్టబయలైంది. ఇస్రో తదుపరి ప్రాజెక్టు మెర్కురీ ఫోర్స్ ఇన్ స్పేస్‌కు సంబంధించి స్పేస్ రీసెర్చి సభ్యునిగా కూడా బోగస్ లెటర్ చూపించాడు. ఇస్రోకు సంబంధించిన ప్రాజెక్టులకు ఎలాంటి సేవలు అందించక పోయినా , ఈ విధమైన బోగస్ ఆధారాలతో ఇస్రో గౌరవాన్ని మంట గలుపుతున్నాడని పోలీస్‌లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News