Monday, December 23, 2024

రాహుల్ గాంధీకి సూరత్ కోర్టులో ఎదురుదెబ్బ! శిక్షపై స్టే నిరాకరణ

- Advertisement -
- Advertisement -

 

 

సూరత్: మోడీ ఇంటిపేరుపై దాఖలైన పరువునష్టం కేసులో తనకు విధించిన రెండేళ్ల కారాగార శిక్షపై స్టే ఇవ్వాలని కోరుతూ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ దాఖలు చేసుకున్న దరఖాస్తును గురువారం గుజరాత్‌లోని సూరత్ కోర్టు తిరస్కరించింది. దిగువ కోర్టు ఇచ్చిన తీర్పుపై దాఖలు చేసుకున్న అప్పీలు పెండింగ్‌లో ఉన్నందున తనకు విధించిన కారాగార శిక్షను నిలుపుదల చేయాలని కోరుతూ రాహుల్ గాంధీ దాఖలు చేసుకున్న దరఖాస్తును అడిషనల్ సెషన్స్ జడ్జి ఆర్‌పి మోగెర తిరస్కరించారు. దిగువ కోర్టు తీర్పును సవాలు చేస్తూ రాహుల్ గాంధీ ఏప్రిల్ 3న సెషన్స్ కోర్టులో అప్పీలు చేసుకున్నారు. సెషన్స్ కోర్టు తీర్పుపై స్టే వచ్చిన పక్షంలో రద్దయిన రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వం పునరుద్ధరణకు అవకాశం కలిగి ఉండేది.

Also Read: వరుణలో సిద్ధరామయ్య నామినేషన్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News