Saturday, December 21, 2024

ప్రేమపెళ్లి… బాబాయ్ కూతురును పొడిచి చంపిన సోదరుడు

- Advertisement -
- Advertisement -

సూరత్: గుజరాత్‌లో పరువు హత్య జరిగింది. ప్రేమ పెళ్లి చేసుకుందని సోదరిని సోదరుడు కత్తితో పొడిచి హత్య చేసిన సంఘటన సూరత్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… రవీంద్ర, వమన్ అన్నదమ్ములు సూరత్‌లో నివసిస్తున్నారు. వమన్‌కు హిమ్మత్‌ అనే కుమారుడు ఉన్నాడు. రవీంద్రన్ కు అనే కల్యాణి సోనేవాని అనే కూతురు ఉంది. మే 29న కల్యాణికి మనోజ్ అలియాస్ కైలాష్‌తో పెద్దలు పెళ్లి నిశ్చయించారు. పెళ్లికి వారం రోజుల ముందు జితేంద్రతో కల్యాణి ప్రేమ వివాహం చేసుకుంది. తమకు ప్రాణహాని ఉందని స్థానిక పోలీసులకు ప్రేమ జంట ఫిర్యాదు చేసింది.

Also Read: జితేందర్ రెడ్డి ట్వీట్ పై వ్యంగ్యంగా స్పందించిన రేవంత్ రెడ్డి

పోలీస్ స్టేషన్ లో కల్యాణి కుటుంబ సభ్యులు తనతో రావాలి అని తన కూతురును అడిగారు. ఆమె మాత్రం తన భర్త జితేంద్రతో జీవనం సాగిస్తానని పోలీసులు ఎదుట ఒప్పుకుంది. రెండు రోజుల క్రితం రామేశ్వర్‌నగర్‌లోని లింబయత్ ప్రాంతంలో కల్యాణిని హిమ్మత్ కత్తితో పలుమార్లు పొడిచి అనంతరం పారిపోయాడు. ఆమె భర్త అక్కడే ఉన్నాడు కానీ ఆపలేకపోయాడు. వెంటనే తీవ్రంగా గాయపడిన ఆమెను ఆస్పత్రికి తరించారు. అప్పటికే ఆమె చనిపోయిందని పరీక్షించిన వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News