Thursday, January 23, 2025

రాహుల్‌ కు శిక్ష విధించిన సూరత్ మేజిస్ట్రేట్‌కు జడ్జిగా పదోన్నతి

- Advertisement -
- Advertisement -

సూరత్: పరువు నష్టం కేసులో రాహుల్‌గాంధీకి శిక్ష విధించిన సూరత్ చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్‌ హదిరాష్ హెచ్ వర్మకు పదోన్నతి లభించింది. 2019 పరువు నష్టం కేసులో రాహుల్‌గాంధీకి వర్మ రెండేళ్ల జైలు శిక్ష విధించారు. సూరత్ చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్‌గా ఉన్న హదిరాష్ హెచ్ వర్మ జిల్లా జడ్జిగా పొందారు. 2019 ఏప్రిల్ 13న కర్ణాటకలో ఎన్నికల ప్రచారంలో భాగంగా జిల్లాలో రాహుల్‌ గాంధీ మాట్లాడుతూ.. దొంగలందరి మోడీ అని వ్యాఖ్యానించారు. దీంతో ఆయనపై గుజరాత్‌లో బిజెపి మాజీ ఎంఎల్‌ఎ పూర్ణేష్ మోడీ పరువు నష్టం కేసు దాఖలు చేశారు.

ఈ కేసును విచారించిన సూరత్‌లోని సిజెఎం కోర్టు ఈ ఏడాది మార్చి రాహుల్‌గాంధీకి శిక్ష విధించింది. సిజెఎం వర్మ జడ్జిమెంటులో ఎంపి స్థాయిలో ఉన్న వ్యక్తి చేసిన వ్యాఖ్యలు ప్రజల్లో తీవ్రమైన ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు. మోడీ ఇంటిపేరుతో దేశవ్యాప్తంగా 13కోట్లమంది ప్రజలు ఉన్నారని వారిని రాహుల్ తన రాజకీయ ప్రయోజనాల కోసం అవమానించారని తీర్పులో పేర్కొన్నారు. కాగా శిక్ష పడిన అనంతరం వయనాడ్ ఎంపిగా ఉన్న రాహుల్‌గాంధీపై పార్లమెంటు అనర్హత వేటు వేయడంతో ఆయన ఎంపి పదవిని కోల్పోయారు.

Also Read: రెజ్లర్లతో అర్థరాత్రి పోలీసు బలగాల కుస్తీ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News