Wednesday, January 22, 2025

ఏప్రిల్ 13 వరకు రాహుల్ గాంధీకి బెయిల్ పొడిగింపు!

- Advertisement -
- Advertisement -

సూరత్(గుజరాత్): గత నెల పరువు నష్టం కేసులో శిక్షకు గురైన కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి నేడు సూరత్ సెషన్స్ కోర్టు ఏప్రిల్ 13 వరకు బెయిల్ పొడిగించింది. తదుపరి విచారణ ఏప్రిల్ 13న ఉండగలదు.  ‘మోడీ ఇంటిపేరు’ విషయంలో అతను అన్న మాటకు లోక్‌సభ నుంచి అనర్హుడిగా తొలగించబడ్డారు. ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష కూడా పడింది. అయితే కింది కోర్టు ఇచ్చిన తీర్పు మీద ఆయన పైకోర్టులో అప్పీల్ చేశారు. ఆయన శిక్ష అమలుపై నెల వరకు స్టే ఇచ్చారు. ఇంకా తాజా వివరాలు తెలియాల్సి ఉంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News