Friday, April 4, 2025

తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి

- Advertisement -
- Advertisement -

తెలంగాణ ప్రాంతంలో నైజాం నిరంకుశ పాలనలో, తెలుగు వారి అణచివేతను వ్యతిరేకిస్తూ సురవరం ప్రతాపరెడ్డి ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసేందుకు, తెలుగు భాషా సంస్కృతుల వికాసానికి, నలేని కృషి చేశారు. నాడు నిజాం పలనలో ఉర్దూ రాజభాషగా చెలామణి అవుతుండేది. తెలు గు పాఠశాలలు, పాఠకులు చాలా తక్కువగా ఉండేవారు. తెలుగు వారు కూడా తెలుగు మాట్లాడితే అవహేళనకు గురయ్యేవారు. తెలంగీ-బేడంగీ: నిజాం రాజ్యంలో మహబూబ్ అలీఖాను వరకు ఫారసీ రాజకీయ భాషగా ఉండేది. ఆరవ నిజాం ఉర్దూను రాజకీయ భాష చేశారు. మొగలులు ఏర్పరచిన భారతీయ భాష ఉర్దూ. మొగల్ సైన్యంలో అనేక ప్రాంతాల వారు ఉండేవారు.

వారికి సంధాన భాషగా ఏర్పడింది. ఉర్దూభాష “ఉర్దూ”కు అర్థం “సైన్యం” ఉర్దూ సైన్యంకోసం ఏర్పడిన భాష. అయినా దాని సౌలభ్యంతో అది ప్రజ ల భాష అయింది. ఉర్దూ సుమారు ఉత్తర భారతంలో మాట్లా డే భాష. కొంత ఫారసీ కలిసి ఉంటుంది. ఉర్దూకు లిపి లేదు. ఫారసీ లిపిని స్వీకరించారు. అది ఎడమ నుండి కుడికి సాగుతుంది. చివరి నిజాం మీర్ ఉస్మానలీ ఖాన్ ఉర్దూ భాషను మ తానికి అంటకట్టి, ఆ మతపు ఆయుధంలో ఒక జాతి సంస్కృతిని సాంతం అవమానించడానికి, కాలరాయడానికి, స మాప్త చేయడానికి ప్రయత్నించాడు.

ఒక జాతి వేష భాషలను అణగదొక్క డానికి కంకణం కట్టుకున్న కర్కోటకుడు, చరిత్రలో ఉసామన్ తప్ప మరొకడు కనిపించడు. నాడు ప్రజ ల ఉద్యమం నిజాం నవాబు నియంతృత్వానికి, నిరంకుశత్వానికి, రాక్షసత్వానికి వ్యతిరేకంగానే కానీ, ఏ మతానికి, ఏ భాషకు వ్యతిరేకంగా కాదు. మర్ ఉస్మానలీఖాను 1911 లో గద్దె ఎక్కాడు. అప్పటి నుంచీ ఒక పథకం ప్రకారం తెలుగును తుడిచి పెట్టడానికి ఉర్దూ బావుటాను కరవాలంగా ఉపయోగించాడు. అంతకు ముందు ఉండిన ప్రభుత్వాలు సైతం తెలుగును గుర్తించలేదు. ప్రోత్సహించలేదు. కాని ఒక పథకం ప్రకారం తుడిచి పెట్టడానికి ప్రయత్నించలేదు. ఉస్మాన్ రాజకీయ చతురుడు. అ తడు తన భద్రత కోసం ఒక భాషను, ఒక మ తాన్ని పోషించాడు. 1918లో ఉస్మాన్, ఉస్మానియా యూనివర్సిటిని ప్రారంభించాడు. ఉ స్మానియాలో ఉర్దూ బోధనా భాషను చేశాడు. ఇది ఉర్దూ ఉద్దరణ కోసం కాక తెలుగును ఇత ర దేశీయ భాషలను రూపు మాపటానికి పన్ని న కుట్ర. ఉస్మానియాలో నామ మాత్రంగా తెలుగు శాఖను ఏర్పాటు చేశారు.

దానికి తొలి ఆచార్యులు, ఏ దేశమేగినా ఎందుకాలిడినా, గేయ రచయిత, ప్రఖ్యాత భావకవి రాయప్రోలు సుబ్బారావు నిజాం కొలువులో రాయప్రోలు వారు షేర్వాణీ ధరించి కొలువుకు వెళ్ళేవారు. తెలుగును ధ్వంసం చేయ పూనుకున్న నిజాం కొలువులో దేశభక్తి గేయ కవి రాయప్రోలు! ఇది వింతయే కాని ఇది వాస్తవం. రాయప్రోలు నిజాంను ప్రశంసిస్తూ రచించిన జాడలు లేవు. బ్రిటీషాంధ్రం నుంచి నిజాం కొలువులో చేరిన కురుగంటి సీతారామయ్య “ఆదర్శ ప్రభువు” అనే గ్రంథం రచించి, ప్రభువు వారి మన్ననలు పొందారు. ఈ పుస్తకాన్ని రాయప్రోలు పీఠి క వ్రాశారు. ఇటువంటి గ్రంథాల ప్రచురణకు ఆంధ్ర సాహి త్య పరిషత్తును స్థాపించారు. ఈ పుస్తకం తెనాలిలో అచ్చయింది. ఆ రోజుల్లో తెలుగు వారి తరఫున నిజాంను పొగడడానికి రప్పించిన ముగ్గురికి రా.కా.సి. అని పేరు పెట్టారు. స్థానిక తెలుగు, రాయప్రోలు, కాసింఖాను సీతారామ భట్టాచార్య, శ్రీరంగం శ్రీనివాసరావు గారు కూడా కొంతకాలం నిజాం కొలువు చేశారని చెప్పుకుంటారు.

“తెలంగీ-బేఢంగీ”, “తెలుగు వి కారభాష” అనే నినాదం ప్రభుత్వ ప్రోత్సాహం తో ప్రచారంలోకి వచ్చింది. అందువల్ల విద్యార్థులు తెలుగులో చేరడానికి జంకేవా రు. అదీగాక బి.ఏ. వరకు ఉర్దూలో మా త్రం చదివిన వారికి తెలుగు ఎలా వంటపడుతుం ది? తెలుగు ప్రభుత్వం గుర్తించని భాష. అందులోని డిగ్రీ పొంది ప్రయోజనం శూన్యం. ఇన్ని అవరోధాలను అధిరోహించి వరంగల్ ఇండ్ల మడికొండకు చెందిన పల్లా దుర్గయ్య సాత్వికులు, విద్వత్ కవి. మను చరిత్రను పరిశోధించి డాక్టరేట్‌ను పొందారు. “గంగిరెద్దు” వం టి ఖండకావ్యాలు రచించారు. ఉస్మానియా నుంచి తెలుగు ప్రొఫెసర్‌గా పదవీ విరమణ చేసి దివంగతులైనారు. నిజాం లో రాజభాష ఉర్దూ. ఇక్కడి శాసనాలు ఉర్దూ. ఆఫీసుల్లో వ్యవహార భాష ఉర్దూ. కోర్టు భాష ఉర్దూ. జరీదా అనగా గెజిటెడ్ భాష ఉర్దూ.

నాణేల మీద భాష ఉర్దూ. దుకాణాలు, వగైరా బోర్డులన్నీ ఉర్దూ. నిజాం శాంతం ఉర్దూమయం. ఎవరైనా తెలుగు మాట్లాడినట్లు వినిపిస్తే “తెలంగీ-బేఢంగి” అని వెక్కిరింపు. ఇలాంటి సందర్భాలలో తెలుగు భాష ప్రచారానికి గాను, తెలంగాణ ప్రాంతాల్లో పాఠశాలల ఏర్పాటుకు ప్రజలను జాగృతం చేయడానికి వీలుగా సురవరం గోల్కొండ పత్రికను స్థాపించారు. గోల్కొండ పత్రిక స్థాపనలో రాజబహదూర్ వెంకటరామారెడ్డి సహాయం సురవరం తీసుకున్నారు. గోల్కొండ పత్రికలో తన సంపాదకీయాలు, ప్రత్యేక వ్యాసాలు రాసి తెలుగు భాషా అభిమానులైన తెలుగు వారందరినీ చైతన్య వంతులను చేయడానికి పూనుకున్నారు. ఆయన నైజాం నిరంకుశ పాలనను విమర్శిస్తూ నిర్భయంగా ఎన్నో వ్యాసాలు రాశారు. ఆనాటి జమీందార్లు, దేశముఖ్‌లు ప్రజలను ఎలా పీడిస్తున్నారు తదితర విషయాలు గోల్కొండ పత్రికలో నిక్కచ్చిగా వ్యాసాలు రాశారు. నైజాం ప్రభుత్వ నిరంకుశ, ప్రజా వ్యతిరేక ఉద్యమాలను ఎదుర్కోవడానికి గోల్కొండ పత్రికను ఒక ఆయుధంలా సురవరం ఉపయోగించారు. అంతేకాదు ప్రతీ గ్రామంలో గ్రంథాలయాల ఏర్పాటు ద్వారా ప్రజలను మరింత చైతన్య వంతులను చేయవచ్చని భావించి, ప్రతి గ్రామంలో గ్రంథాలయం ఏర్పాటుకై గ్రంథాలయోధ్యమానికి శ్రీకారం చుట్టారు.

గ్రంథాలయాలు, పాఠశాలల ఏర్పాటులో నైజం ప్రభుత్వం నుండి ఎన్నో అవరోధా లు, అడ్డంకులు ఎదుర్కోవాల్సి వచ్చిన లెక్క చేయక గ్రంథాలయాల ఏర్పాటును ఒక ఉద్యమంగా ఆయనను కొనసాగించారు. గ్రంథాలయాల ఏర్పాటుతో ప్రజా విప్లవం ఊపందుకోగలదన్న భావంతో నైజాం సర్కార్ కొత్తగా గ్రంథాలయాల ఏర్పాటును నిషేదించింది. అంతే కాదు తెలుగు వారు సభలు, సమావేశాల ఏర్పాటు కూడా ముందుగా అనుమతి లేకుండా చేపట్టరాదని ఉత్తర్వులు జారీ చేసింది. సురవరం ప్రతాపరెడ్డి ఆ మహానీయుని అడుగు జాడలలో నడుచుకుంటూ ఆయన ఆశయాలను అమలు చేయడానికి పునరంకితం కావడమే ఆయనకు అందించే ఘనమైన నివాళి.
(తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి 125వ జయంతి (మార్చి 28) ఉత్సవాల సందర్భంగా)

కొలనుపాక కుమారస్వామి, 99637 20669

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News