Wednesday, January 22, 2025

సెస్సులు, సర్‌చార్జీల్లో రాష్ట్రాలకు వాటా ఉండదు: నిర్మలా సీతారామన్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కొన్ని నిర్దిష్ట ప్రయోజనాల కోసం కేంద్రం విధించే సెస్సులు, సర్‌చార్జీలలో రాష్ట్రాలకు వాటా ఉండదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. రాజ్యసభలో మంగళవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ ఆమె ఈ విషయం చెప్పారు. వసూలయ్యే మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వమే వినియోగించుకుంటుందని తెలిపారు. 2014-15 నుంచి 2021–22 వరకు కేంద్రం వసూలు చేసిన పట్టికను ఆమె వివరించారు. 15వ ఆర్థిక సంఘం అవార్డు రాష్ట్రాలకు పన్నుల వాటా పంపిణీ కోసం కొన్ని ప్రతిపాదనలు చేసిందన్నారు. రాష్ట్ర జనాభా, భౌగోళిక విస్తీర్ణం, అటవీ, పర్యావరణం, ఆదాయ వనరుల వెయిటేజి వంటివన్నీ పరిగణనలోకి తీసుకుని వాటా ఇస్తున్నారు. ఈ ప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్‌కు పన్నుల పంపిణీలో 4 శాతమే. 202324 అంచనాల మేరకు కేంద్ర పన్నులలో ఆంధ్రప్రదేశ్ వాటా కింద రూ. 41338 కోట్ల రూపాయలు పంపిణీ చేయనున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News