Thursday, January 23, 2025

వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ఘనంగా నడిపిన సురేఖ..

- Advertisement -
- Advertisement -

ముంబై : ఆసియా లోనే మొదటి మహిళా లోకోపైలట్‌గా చరిత్ర కెక్కిన సురేఖ యాదవ్ మరో ఘనత సాధించారు. కొత్తగా ప్రవేశ పెట్టిన సెమీ హైస్పీడ్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ఆసియా లోనే విజయవంతంగా నడిపిన మొదటి మహిళా లోకోపైలట్‌గా రికార్డు సాధించారు. సోమవారం సోలాపూర్, ముంబై లోని ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినస్ (సిఎస్‌ఎంటి) మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును నడిపారు. సోలాపూర్ స్టేషన్‌లో సోమవారం రాత్రి ఈ ఎక్స్‌ప్రెస్ రైలు సరైన సమయానికే బయలుదేరిందని, సిఎస్‌ఎంటికి ఐదు నిమిషాలు ముందుగానే చేరుకుందని సెంట్రల్ రైల్వే ప్రకటించింది. 450 కిమీ కన్నా ఎక్కువ ప్రయాణం పూర్తి చేసినందుకు సిఎస్‌ఎంటి 8 వ ప్లాట్‌ఫారం వద్ద సురేఖను తోటి సిబ్బంది సత్కరించినట్టు పేర్కొంది. నారీ శక్తి సాధికారతతో కూడిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును మొదటి మహిళా లోకోపైలట్ సురేఖ నడపడం అభినందనీయమని రైల్వే మంత్రి అశ్వినీయాదవ్ ట్వీట్ చేశారు.

పశ్చిమ మహారాష్ట్ర రీజియన్ లోని సతారా ప్రాంతానికి చెందిన సురేఖా యాదవ్ 1988 లో భారత మొట్టమొదటి మహిళా రైలు డ్రైవర్‌గా తయారయ్యారు. అనేక విజయాలు సాధించినందుకు రాష్ట్రం లోనూ, జాతీయస్థాయిలోనూ ఆమె అనేక అవార్డులు పొందారు. కొత్త రూట్లలో లోక్ పైలటింగ్ అన్నది చాలా సంక్లిష్టమైన సాంకేతిక పరిజ్ణాన అనుభవంతో కూడుకున్నదని , సిబ్బంది అభ్యాస ప్రక్రియలో భాగంగా సిగ్నల్స్ పాటించడం, కొత్త పరికరాలపై పట్టుసాధించడం, ఇతర సిబ్బందితో సమన్వయం సాధించడం తదితర అన్ని ప్రమాణాలు పాటించాలని అధికారులు చెప్పారు. అత్యాధునిక సాంకేతికతతో తయారైన వందేభారత్ రైలును నడిపే అవకాశాన్ని తనకు కల్పించినందుకు రైల్వేశాఖ అధికారులకు సురేఖ కృతజ్ఞతలు తెలిపారు. సిఎంఎస్‌టిసోలాపూర్, సిఎస్‌ఎంటిసాయినగర్ షిరిడి రూట్లలో రెండు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను సెంట్రల్‌రైల్వే ప్రవేశ పెట్టింది. గత ఫిబ్రవరి 10న ప్రధాని మోడీ వీటికి పచ్చజెండా ఊపి ప్రారంభించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News