Wednesday, January 22, 2025

వీడియో వైరల్: దయచేసి నన్ను అర్థం చేసుకోండి

- Advertisement -
- Advertisement -

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో మరోసారి చర్చనీయాంశంగా మారింది. నిర్మాత కేపీ చౌదరి ఇటీవల డ్రగ్స్‌తో పట్టుబడ్డాడు. పోలీసు కస్టడీలో ఉన్న అతడి ఫోన్‌ను పరిశీలించగా.. పలువురు నటీనటుల పేర్లు బయటపడ్డాయి. ఈ జాబితాలో నటి సురేఖావాణి ఆరోపణలు ప్రముఖంగా ఉన్నాయి. ఆమె డ్రగ్స్ తీసుకున్నట్లు పుకార్లు వచ్చాయి. ఇప్పుడు వీటిపై ఆమె స్వయంగా స్పందించింది.

ఈ డ్రగ్స్ కేసులో సురేఖావాణి పేరు బయటకు వస్తోందా కాదా అని నిర్ధారించుకునేలోపే, ఆమె కెపి చౌదరి చెంపపై ముద్దుపెట్టుకున్న పాత ఫోటో ఒకటి బయటికి వచ్చింది. ఆ రోజు అతను మద్యం లేదా డ్రగ్స్ మత్తులో ఉన్నాడని పలువురు నెటిజన్లు వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఈ వార్తలను ఖండిస్తూ సురేఖావాణి మీడియాకు ఓ వీడియో విడుదల చేసింది.

‘కొంతకాలంగా మాపై వస్తున్న ఆరోపణలతో మాకు ఎలాంటి సంబంధం లేదు. దయచేసి మాపై ఆరోపణలు చేయడం ఆపండి. మీరు చేస్తున్న పనుల వల్ల, నా కెరీర్, నా పిల్లల కెరీర్, నా కుటుంబం ఆరోగ్యం… ఇలా అనేక రకాలుగా మేం ప్రభావితమవుతున్నాం. దయచేసి అర్థం చేసుకోండి’ అని సురేఖావాణి ఈ వీడియోలో పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News