అమరావతి: అక్రమ ఇసుకను అడ్డుకుంటున్నానని టిడిపి ఎమ్మెల్యే కూన రవి కుమార్ అనుచరులు తన దాడి చేశారని బాధితుడి సనపల సురేష్ ఆరోపణలు చేశారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గంలో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్నాడని సనపల సురేష్ అనే వ్యక్తిని రాగోలు వద్ద కొందరు అడ్డుకున్నారు. ఆ సమయంలో సురేష్ కారులో వేగంగా ముందుకు తీసుకెళ్లడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో బలగ కూడలి వద్ద సురేష్ కారును మళ్లీ అడ్డుకోవడానికి ప్రయత్నించడంతో అతడు కారును ఆపకపోవడంతో దాడికి దిగి కారు అద్దాలు పగలగొట్టి ధ్వంసం చేశారు. ఇసుక అక్రమ రవాణాకు అడ్డుపడుతున్నాననే తనపై టిడిపి ఎమ్మెల్యే కూన రవికుమార్ అనుచరులు దాడి చేశారని బాధితుడు సురేష్ ఆరోపిస్తున్నాడు. టిడిపి అనుచురుల నుంచి తప్పించుకునే క్రమంలో ప్రమాదాలు జరిగాయని బాధితుడు సురేష్ వాపోతున్నాడు. వాహనదారులను కారుతో ఢీకొట్టడంతో సనపల సురేష్ పై స్థానికులు దాడి చేశారని టిడిపి కార్యకర్తలు ఆరోపణలు చేస్తున్నారు.
ఇసుక మాఫియాను అడ్డుకుంటున్నానని నాపై దాడి: సురేష్
- Advertisement -
- Advertisement -
- Advertisement -