Monday, December 23, 2024

సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్‌గా సురేష్ ఎన్ పటేల్

- Advertisement -
- Advertisement -

Suresh N Patel as Central Vigilance Commissioner

న్యూఢిల్లీ : సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్‌గా సురేష్ ఎన్ పటేల్ నియామకమయ్యారు. సీవీసీ నియామకాన్ని ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వం లోని సెలక్షన్ కమిటీ ఇటీవల ఆమోదించింది. రాష్ట్రపతి భవన్‌లో బుధవారం సురేష్ పటేల్‌తో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించారు. సురేష్ పటేల్ గతేడాది జూన్ నుంచి తాత్కాలిక సెంట్రల్ విజిలెన్స్ కమిషన్‌గా పనిచేస్తున్నారు. రాష్ట్రపతి భవన్‌లో బుధవారం ఉదయం 10 గంటలకు సీవీసీ ప్రమాణస్వీకారం జరగ్గా, ప్రధాని నరేంద్రమోడీ, ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు, హాజరయ్యారు. సురేష్ పటేల్ ఇంతకు ముందు ఆంధ్రాబ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్, సీఈవోగా సేవలందించారు. 2020 ఏప్రిల్‌లో ఆయన విజిలెన్స్ కమిషనర్‌గా నియామకమయ్యారు. ఇంతకు ముందు సీవీసీ గా పనిచేసిన ఐఎఎస్ అధికారి సంజయ్ కొఠారీ గత ఏడాది జూన్ 24 న పదవీ విరమణ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News