న్యూఢిల్లీ: ఐపిఎల్ సీజన్ 2025లో వరుస ఓటములతో సతమతమవుతున్న చెన్నై సూపర్ కింగ్స్ (సిఎస్‌కె)పై ఆ జట్టు మాజీ ఆటగాడు సురేశ్ రైనా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాడు. చెన్నై ఇలాంటి చెత్త ప్రదర్శన చేస్తుందని తాను ఊహించలేక పోయానన్నాడు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో బలంగానే ఉన్నా వరుస ఓటములు ఎదురు కావడం బాధించే అంశమన్నాడు. ఆటగాళ్లలో గెలవాలనే కసి కనిపించడం లేదన్నాడు.
ఏ మ్యాచ్‌లోనూ చెన్నై తన స్థాయికి తగ్గ ఆటను కనబరచలేక పోయిందన్నాడు. కెప్టెన్ మారినా జట్టు ఆట తీరులో ఏమాత్రం మార్పులేదన్నాడు. ఇతర జట్ల ఆటగాళ్లు సర్వం ఒడ్డి పోరాడుతుంటే సన్‌రైజర్స్ టీమ్‌లో అది కొరవడిందన్నాడు. స్టార్ క్రికెటర్లు జట్టులో ఉన్నా పెద్దగా ప్రయోజనం కనిపించడం లేదన్నాడు. జట్టు యాజమాన్యం కూడా ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని నింపక పోవడం బాధగా ఉందన్నాడు. ఇప్పటికైనా చెన్నై ఆటగాళ్ల ఆట తీరులో మార్పు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని రైనా పేర్కొన్నాడు.