Sunday, January 19, 2025

 రోడ్డు ప్రమాదంలో సురేశ్ రైనా కజిన్ మృతి

- Advertisement -
- Advertisement -

కాంగ్రా(హిమాచల్ ప్రదేశ్): మాజీ క్రికెటర్, చైన్నై సూపర్ కింగ్స్ స్టార్ బ్యాట్స్ మన్ సురేశ్ రైనా కజిన్ సౌరభ్ కుమార్ హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రా జిల్లాలో రోడ్డు ప్రమాదంలో మరణించాడు. స్కూటర్ లో అతడితో పాటు పయనించిన 19 ఏళ్ల శుభం అనే వ్యక్తి కూడా రోడ్డు ప్రమాదంలో మరణించాడు. దీనికి సంబంధించి కాంగ్రాలోని గగ్గల్ ఎయిర్ పోర్టు సమీపంలో గగ్గల్ పోలీస్ స్టేషన్ లో రిపోర్గు నమోదయింది. హిట్ అండ్ రన్ కు పాల్పడి పరారయిన ట్యాక్సీ డ్రయివర్ కోసం పోలీసులు వెతుకుతున్నారు. సౌరభ్ తండ్రి మగో రామ్ ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ లో ధోని తల(హెడ్) అయితే, రైనాను చిన్న తల( జూనియర్ హెడ్) అని అభిమానులు పిలుస్తుంటారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News