- Advertisement -
తెలంగాణకు ఎల్లో అలర్ట్
మనతెలంగాణ/హైదరాబాద్ : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో రాబోయే మూడు రోజులు రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. బంగాళాఖాతంలో మయన్మార్, బంగ్లాదేశ్‌పైన మేఘాలు ఆవరించి ఉన్నాయని,ఇవి ఆదివారం తెలుగు రాష్ట్రాల వైపుగా కదులుతున్నాయని తెలిపింది.వీటి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొంది.తెలంగాణలో నల్లగొండ, హైదరాబాద్, యాదాద్రి-భువనగిరి, వికారాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, సిద్దిపేట జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది.ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.
- Advertisement -