- Advertisement -
రాష్ట్రంలో రెండు రోజులు వర్షాలు
మనతెలంగాణ/హైదరాబాద్ : నైరుతి బంగాళాఖాతంలో ఒకటి, కన్యాకుమారి తీరంలో మరోకటి ఉపరితల ఆవర్తనం నెలకొని ఉందని , వీటి ప్రభావంతో ఈశాన్య రుతుపవనాలు మరింతగా విస్తరించి ఉన్నట్టు భారతవాతావరణ శాఖ వెల్లడించింది. సముద్ర తీర ప్రాంత జిల్లాల్లో , డెల్టా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్టు తెలిపింది.
మరోవైపు తూర్పుగాలులలోని ద్రోణి కొమరెన్ ప్రాంతం నుండి ఆంధ్రప్రదేశ్ తీరంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకూ సగటు సముద్ర మట్టం నుండి 3.1 కిలోమీటర్ల ఎత్తువరకూ వ్యాపించి ఉంది .కిందిస్థాయిలో గాలులు తూర్పు దిశ నుంచి తెలంగాణ వైపునకు వీస్తున్నాయి . వీటి ప్రభావంతో బుధ , గురువారాల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
- Advertisement -