Monday, January 20, 2025

గంగా నది నీటి మట్టం పెరుగుతోంది

- Advertisement -
- Advertisement -

రిషికేశ్: ఉత్తరాఖండ్ లో కురిసిన కుంభ వృష్టి వర్షం కారణంగా రిషికేశ్ లో గంగా నది నీటి మట్టం పెరిగింది. చాలా మంది ఆదివారం ఇది గమనించారు. అక్కడ నీటి మట్టం ఎంతగా పెరిగిందంటే… త్రివేణి ఘాట్ హారతి స్థలం దాకా పెరిగిపోయింది. దీంతో రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం(ఎస్ డిఆర్ఎఫ్) రాత్రుల్లో ఘాట్ ల వద్ద ఉండొద్దంటూ హెచ్చరికలు జారీ చేసింది.

నది ఒడ్డున నివసించేవారు, నిరాశ్రయులైన వారితో పోలీసులు నిరంతరం టచ్ లో ఉన్నారని డెహ్రాడూన్ రూరల్ పోలీస్ సూపరింటెండెంట్ లోక్ జీత్ తెలిపారు. ఇదిలావుండగా జులై 10 వరకు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో భారీ వానలు కురియనున్నట్లు ఉత్తరాఖండ్ లోని వాతావరణ కేంద్రం తెలిపింది.ముఖ్యంగా డెహ్రాడూన్, తెహ్రీ, హరిద్వార్, ఉత్తరకాశీ జిల్లాల్లో ఆదివారం భారీ వర్షం కురియవచ్చని హెచ్చరించింది. జులై 8 నుంచి 9 వరకు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురియవచ్చని తెలిపింది. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ అప్రమత్తంగా ఉండాలంటూ జిలా మెజిస్ట్రేట్లకు ఆదేశాలు జారీ చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News