Monday, December 23, 2024

ఉస్మానియాలో కార్పొరేట్ వైద్యం

- Advertisement -
- Advertisement -

గోషామహల్: ఉస్మానియా ఆసుపత్రి వైద్య నిపుణులు కార్పొరేట్ స్థాయిలో అత్యంత అ రుదైన శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహిస్తూ, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు, ప్రజల మన్ననలు అందుకుంటున్నారు. అధిక బరువు (స్థూలకాయం)తో బాధ పడుతున్న ఓ యువకుడికి ఉస్మాని యా ఆసుపత్రి వైద్యులు అత్యంత క్లిష్టమైన శస్త్ర చికిత్సను, సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ. అనస్థీషియా, ఎండోక్రైనాలజీ విభాగాల వైద్యుల బృందం విజయవంతంగా నిర్వహించి పునర్జన్మ ప్రసాదించారు. ఈ మేరకు బుధవారం ఉస్మానియా ఆసుపత్రిలో ఏ ర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర బి నాగేందర్ శస్త్రచికిత్స సంబంధిత వివరాలను సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ, అనస్థీషియా, ఎండో క్రైనాలజీ విభాగాధిపతులు డా క్టర్ మధుసూదన్, డాక్టర్ పాండునాయక్, డాక్టర్ రాకేష్ సహాయ్‌లతో కలిసి వెల్లడించారు. గుడి మ ల్కాపూర్ మహేష్ నగర్ ప్రాంతానికి చెందిన శివరాజ్‌సింగ్‌కు ఇద్దరు ఆడ పిల్లలు, ఒక కుమారుడు సం తానం.

వీరి కుటుంబం వంశ పారంపర్యంగా స్థూలకాయులే కావడం గమనార్హం. కాగా రెండవ సంతా నం కుమారుడైన మునీందర్‌సింగ్ (23) ఐదేళ్ల ప్రా యం నుండి క్రమంగా వయస్సుతో పాటు అధిక బరువు పెరుగుతూ వచ్చాడు. అయితే 23 సంవత్సరాల మునీందర్‌సింగ్ స్థూలకాయం (220 కిలోల బరువు) కారణంగా నడవలేని నిస్సహాయ స్థితికి చే రుకున్నాడు. అధిక బరువు ఉండటంతో ఎక్కువ సే పు నిల్చోలేక, కూర్చోలేక, శ్వాస తీసుకునేందుకు సై తం తీవ్ర ఇబ్బంది పడుతున్నాడు. దీంతో కుటుంబ సభ్యు లు చికిత్సల నిమిత్తం అతన్ని రెండు నెలల క్రితం ఉస్మానియా ఆసుపత్రిలో చేర్పించారు. అతన్ని పరీక్షించిన ఉస్మానియా సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాల జీ, ఎండో క్రైనాలజీ విభాగం వైద్యులు ఈ కేసును ఛాలెంజ్‌గా తీసుకుని వివిధ రకాల పరీక్షలు నిర్వహించి, చిన్న వయస్సులోనే షుగర్, బీపీలతో పాటు కొలెస్ట్రాల్, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందుతు, ని ద్రలో గురక వంటి సమస్యలతో బాధ పడుతున్నట్లు గుర్తించారు.

ఆసుపత్రిలో చేరినప్పుడు 220 కిలోల బరువు గల మునీందర్‌సింగ్‌కు ఇటీవలే బేరియాట్రి క్ సర్జరీ నిర్వహించి, చిన్నపేగును కత్తిరించి పొట్ట సైజును తగ్గించడంతో పాటు అతని శరీరంలోని కొవ్వును తొలగించి విజయవంతంగా శస్త్ర చికిత్స ను పూర్తి చేశారు. కొద్దిగా ఆహారం తినగానే కడుపు నిండిపోవడంతో పాటు స్థూలకాయం పె రగకుండా ఉండేందుకు మున్ముందు క్రమం తప్పకుండా వైద్యులను సంప్రదించి సూచనలు, సలహాలు పాటించాల్సిన అవసరం ఉంటుందని డాక్టర్ మధుసూదన్ పేర్కొన్నారు. ఇటీవల కాలంలో స్థూలకాయంతో బా ధపడుతున్న సెలబ్రిటీలు చేయించుకున్న శస్త్ర చికిత్సలు వికటించి మృతి చెందిన ఘటనలు ఉన్నాయ ని గుర్తుచేశారు. మునీందర్‌సింగ్ విషయంలో అ లాంటి దుర్ఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేక శ్రద్ధ్ద వహించినట్లు తెలిపారు. వైద్యుల స్వీయ పర్యవేక్షణలో వైద్యం చేయించుకునే వారికి తమవంతు సేవలు అందించేందుకు సిద్ధ్దంగా ఉన్నామని అన్నా రు.

220 కిలోల స్థూలకాయంతో ఉస్మానియాలో చేరిన మునీందర్‌సింగ్‌కు శస్త్రచికిత్స అనంతరం 180 కిలోలకు తగ్గించడంతో పాటు నడక, శ్వాస తీసుకోవడంతో పాటు ద్రవ పదార్థాల రూపంలో పండ్ల రసాలు, త్వరగా జీర్ణమయ్యే పదార్థాలు తిం టున్నాడని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం, వైద్య ఆరోగ్య శాఖా మంత్రి హరీష్‌రావు, వైద్యశాఖ ఉన్నతాధికారులు అందించిన ప్రోత్సాహం వల్లే అత్యంత క్లిష్టతరమైన, అరుదైన, ఖరీదైన శస్త్రచికిత్సను ఉస్మానియా ఆసుపత్రిలో కార్పొరేట్ స్థాయిలో విజయవంతంగా నిర్వహించగలిగామని వెల్లడించారు. ప్రభు త్వం, ఉన్నత వైధ్యాధికారుల సహకారంలో భవిష్యత్‌లో మరిన్ని అరుదైన, క్లిష్టమైన శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించేందుకు ఉస్మానియా ఆసుపత్రిలో వైద్యులు సిద్ధ్దంగా ఉన్నారని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News