Sunday, January 19, 2025

సూర్య కెరీర్‌లో భారీ వసూళ్ల ‘కంగువ’

- Advertisement -
- Advertisement -

స్టార్ హీరో సూర్య నటించిన ప్రతిష్టాత్మక మూవీ కంగువ. ఈ చిత్రాన్ని భారీ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ గా దర్శకుడు శివ రూపొందించారు. దిశా పటానీ, బాబీ డియోల్ కీలక పాత్రల్లో కనిపించారు. ’కంగువ’ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మించారు. ఈ సినిమాను నైజాం ఏరియాలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేశారు. ’కంగువ’ సినిమా ఈ నెల 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా మాట్లాడుతూ “కంగువ సినిమాకు మేము పడిన మూడేళ్ల కష్టానికి ఫలితంగా ప్రేక్షకులు ఘన విజయాన్ని అందించారు.

మంచి చిత్రాలను ఆదరించడంలో తెలుగు ప్రేక్షకుల అభిరుచి మరోసారి వెల్లడైంది. సూర్య సినిమాల్లో భారీ వసూళ్లు సాధించిన మూవీగా ’కంగువ’ నిలుస్తుంది. తెలుగులో కలెక్షన్స్ బాగా పెరుగుతున్నాయి. ‘కంగువ’లో మేము ఒక కొత్త ప్రపంచాన్ని నిర్మించాము. దర్శకుడు శివ ’కంగువ’ను అద్భుతంగా రూపొందించారు. సూర్య చేసిన రెండు విభిన్నమైన పాత్రలకు మంచి ప్రశంసలు వస్తున్నాయి. ఆయన ఈ మూవీ కోసం పడిన కష్టం స్క్రీన్ మీద కనిపించింది. బాబీ డియోల్ నటన మరో హైలైట్ అని చెబుతున్నారు. – ’కంగువ’కు దేవిశ్రీ ప్రసాద్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. బీజీఎం కూడా ది బెస్ట్ అందించారు. యోలో, ఫైర్ సాంగ్, నాయకా ..ఇలా ప్రతి సాంగ్‌కు మంచి స్పందన వస్తోంది. డైరెక్టర్ శివకు అజిత్‌తో ఓ మూవీ చేయాల్సిన కమిట్‌మెంట్ ఉంది. ఆ ప్రాజెక్ట్ అయ్యాక ‘కంగువ 2’ వర్క్ ప్రారంభిస్తాము. ప్రస్తుతం కార్తితో మా స్టూడియో గ్రీన్‌లో చేస్తున్న ‘వాతియర్’ జనవరి చివరలో లేదా ఫిబ్రవరిలో రిలీజ్ చేస్తాం”అని అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News