Monday, December 23, 2024

అందరికీ కనెక్ట్ అయ్యే ‘ఇటి’..

- Advertisement -
- Advertisement -

Suriya Special Interview about 'ET' Movie

కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా పాండిరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఇటి’ (ఎవరికీ తలవంచడు). ఈ సినిమా ఈనెల 10న విడుదల కాబోతోంది. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఏషియన్ మల్టీప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ సినిమా తెలుగు వర్షన్‌ను విడుదల చేస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో సూర్య మీడియాతో ముచ్చటిస్తూ చెప్పిన విశేషాలు…

పెను మార్పులు…
గ్రామం నుంచి విదేశాల్లోని మనుషులను ఒకేసారి పాండమిక్ మార్చేసింది. మనుషుల జీవితాలనే కాదు సినిమా పరిశ్రమలోనూ పెను మార్పులు తీసుకు వచ్చేలా చేసింది. ఈ సమయంలో నా సినిమాలు ఆకాశం నీ హద్దురా, జై భీమ్ ఓటీటీలో విడుదలై మంచి ఆదరణ పొందాయి.
కొత్త వారు వెలుగులోకి…
డిజిటల్ బిజినెస్ నిర్మాతలకు ఉత్సాహానిచ్చింది. కొత్త దర్శకులు, రచయితలు, కొత్త కథలు వెలుగులోకి వచ్చాయి. పాండమిక్ తర్వాత పుష్ప, భీమ్లానాయక్ సినిమాలు థియేటర్లో విడుదలై మంచి కలెక్షన్లు రాబట్టాయి. అలా సినిమాలకు పెద్ద వ్యాపారం జరిగేలా పరిస్థితులు అనుకూలించాయి.
నిర్మాతలు హ్యాపీగా…
ఫాంటసీ సినిమాలే కాదు కంటెంట్ సినిమాలకు యూత్ పెద్ద పీట వేస్తున్నారు. విప్లవాత్మకమైన ఈ మార్పులు సినిమా రంగం పురోభివృద్ధికి దోహదం చేస్తున్నాయి. మంచి సినిమాలు వస్తే శుక్ర, శనివారం, ఆదివారం యూత్ బాగా చూస్తున్నారు. దీంతో నిర్మాతలు చాలా హ్యాపీగా వున్నారు.
అందరూ కనెక్ట్ అవుతారు…
‘ఇటి’ సినిమా సమాజంలో మన చుట్టూ జరుగుతున్న అంశాల ఆధారంగా తెరకెక్కింది. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడుతోపాటు దేశంలో ఎక్కడివారైనా ఈ సినిమాకు కనెక్ట్ అవుతారు. ప్రతి గ్రామంలోనూ జరుగుతున్న సంఘటనలే ఈ సినిమాలో కనిపిస్తాయి. వాటిని దర్శకుడు ఎలా డీల్ చేశాడనేది ఈ సినిమా.
అభిమానులను మెప్పించే…
‘ఇటి’లో విలన్ సరికొత్తగా ఉంటాడు. ఎంటర్‌టైన్‌మెంట్, ఎమోషన్స్‌ను దర్శకుడు బాగా చూపించాడు. నా అభిమానులను మెప్పించే సినిమా ఇది. ఈ సినిమాకు నేను తెలుగు డబ్బింగ్ చెప్పాను. అది యాసలో వుంటుంది. తమిళంలో కూడా ఇలా వుంటే వెరైటీగా వుంటుందని దర్శకుడు చెప్పారు.
తదుపరి చిత్రాలు…
దర్శకుడు బాలతో ఓ సినిమా చేస్తున్నా. వెట్రిమారన్‌తో ‘వాడి వాసల్’ సినిమా చేయాలి. ఈ సినిమాను జూన్‌లో ప్రారంభించాలని అనుకుంటున్నాము.

Suriya Special Interview about ‘ET’ Movie

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News