Wednesday, January 22, 2025

సూర్య కొత్త ప్రయాణం..

- Advertisement -
- Advertisement -

విలక్షణ నటుడు సూర్య హీరోగా నటించిన చిత్రం ‘ఆకాశం నీ హద్దురా’ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. సుధా కొంగర దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఇప్పుడు బాలీవుడ్‌లో రీమేక్ చేస్తున్నారు. హిందీ వర్షన్‌కు సూర్య నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. అతడి సొంత నిర్మాణ సంస్థ ‘2డీ ఎంటర్ టైన్‌మెంట్’ అక్షయ్ కుమార్ హీరోగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సందర్భంగా అక్షయ్‌తో తీసుకున్న ఫొటోలను సూర్య సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. “కొత్త ప్రయాణం ప్రారంభమైంది. మీరందరూ ప్రేమ, ఆశీర్వాదాలు అందించాలి” అని ట్విట్టర్‌లో సూర్య పోస్ట్ పెట్టాడు.

Suriya to remake Soorarai Pottru with Akshay Kumar

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News