కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన కంగువా మూవీ అస్కార్ బరిలో నిలిచింది. 2025లో 97వ ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం జరగనుంది. ఈ పురస్కారం కోసం కంగువా మూవీతోపాటు భారత్ నుండి ఆడు జీవితం, సంతోష్, స్వతంత్ర వీర్ సావర్కర్ చిత్రాలు కూడా షార్ట్ లిస్ట్ అయ్యాయి. ఇక, కంగువా సినిమా ఉత్తమ చిత్రం విభాగంలో పోటీ పడనున్నట్లు తెలుస్తోంది.
కాగా, అక్టోబర్ 10న ప్రపంవ్యాప్తంగా తమిళ్, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో భారీగా విడుదలైన కంగువా మూవీ బాక్సాపీస్ వద్ద ఆకట్టుకోలేకపోయింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా తీవ్రంగా నిరాశపర్చింది. సూర్య కెరీర్ లోనే భారీ డిజాస్టర్ గా నిలిచింది.తమిళ్ లోనూ అట్టర్ పాప్ అయ్యింది.
- Advertisement -