Friday, November 15, 2024

బెంగళూరును దాటేశాం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ హైదరాబాద్ : భారతదేశం టెక్ రాజధాని అంటే బెంగళూరు అని చెప్తారు, కానీ ఇ ప్పుడు ఈ స్థానాన్ని హైదరాబాద్ సొంతం చేసుకు నే స్థాయికి ఎదిగింది. ఎందుకంటే ఐటి (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) రంగంలో తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరం బెంగళూరుకు గట్టిపోటీ ఇ స్తోంది. మెరుగైన మౌలిక సదుపాయాలు, అభివృ ద్ధి చెందుతున్న పర్యావరణ వ్యవస్థ, గృహ ఎంపికలు, ప్రభుత్వ కార్యక్రమాలు తెలంగాణ రాజధానికి మార్గాన్ని సుగమనం చేస్తున్నాయి. బెంగళూరులో పేరుకుపోయిన ట్రాఫిక్,మౌలికసదుపాయా ల సమస్యలు కూడా హైదరాబాద్‌కు సానుకూలం గా మారాయి.

భారతదేశం సిలికాన్ వ్యాలీగా పిలిచే బెంగళూరు దేశంలో కేంద్రాలను స్థాపించాలని చూస్తున్న బహుళజాతి కంపెనీలకు చాలా కాలంగా తిరుగులేని నాయకుడిగా ఉంది. దేశంలోని దా దాపు సగం గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లు (జిసిసి లు) ఇప్పటికీ బెంగళూరులోనే ఉన్నాయి. ఇప్పుడు భారతదేశంలో జిసిసిలను ఏర్పాటు చేయాలని చూస్తున్న కంపెనీల ప్రమాణాలు బెంగళూరు అం దుకోలేకపోతోంది. వాస్తవానికి 2023 ప్రథమార్థంలో ఏర్పాటు చేసిన జిసిసిల సంఖ్య-, విస్తరణలు- చూస్తే హైదరాబాద్ బెంగళూరును అధిగమించిం ది. ఎవరెస్ట్ గ్రూప్ అనే అంతర్జాతీయ పరిశోధనా సంస్థ ప్రకారం, 2023 ప్రథమార్థంలో బెంగళూరు 13 జిసిసిలను ఏర్పాటు చేయగా, హైదరాబాద్‌లో ఈ సంఖ్య 23కి చేరుకుంది. నాస్కామ్-జిన్నోవ్ నివేదిక ప్రకారం, ఈ సంఖ్యలు స్వల్పంగా మారుతూ ఉంటాయి. అయితే ఇదే కాలంలో బెంగళూరులో ఎనిమిది కొత్త సెటప్‌లు, హైదరాబాద్‌లో ఏడు సె టప్‌లు ఉన్నాయని పేర్కొంది. భారతదేశంలో స్థా పించిన జిసిసిల విస్తరణ పరంగా హైదరాబాద్‌లో నాలుగు, బెంగళూరులో మూడు ఉన్నాయి. మొ త్తంగా చూస్తే, పుణె లేదా ఎన్‌సిఆర్ రీజియన్ వం టి నగరాల కంటే ఈ రెండు నగరాల మధ్య గట్టిపోటీ నడుస్తోంది. దీనికి అనేక కారణాలు ఉ న్నప్పటికీ, బెంగళూరు నగరానికి మాత్రం మౌలిక సదుపాయాలతో ఉన్న పాత సమస్యలు ప్రతిబంధకం గా మారగా, ఇది హైదరాబాద్ వైపు చూసేలా చే స్తుందని, అందుకే తెలంగాణ రాజధానికి పెట్టుబడులు పెరుగుతున్నాయనినిపుణులు పేర్కొంటున్నారు. బెంగళూరులో పర్యావరణ వ్యవస్థ ఉండ గా, హైదరాబాద్ కొత్త తరంతో దూకుడుగా ఉం దని నిపుణులు భావిస్తున్నారు. ఎఎన్‌ఎస్‌ఆర్ కన్సల్టింగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లలిత్ అహుజా మనీకంట్రోల్‌తో మాట్లాడుతూ, మౌలిక సదుపాయాల కోణంలో హైదరాబాద్ మెరుగ్గా ఉందని అ న్నారు. హైదరాబాద్‌లో చాలా పెద్ద టెక్ కమ్యూనిటీ ఉందని, అనేక పెద్ద టెక్ ఉత్పత్తి కంపెనీలు హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్నాయని, ఫ్రెషర్‌లను కూడా ఆకర్షించే మంచి విద్యా పర్యావరణ వ్యవస్థ ఉందని అన్నారు. ఒక మార్కెట్ ఆధిపత్యం స్పష్టంగా సమస్యలను సృష్టిస్తుందని ఆయన అన్నారు. ఇవై ఇండియాలో భాగస్వామి, జిసిసి సెక్టార్ లీడర్ అయిన అరిందమ్ సేన్ మాట్లాడుతూ, బెంగళూరు ఆకర్షణీయమైన గమ్యస్థానంగా కొనసాగుతోంది, అయితే హైదరాబాద్, పుణెలు దీనికి ప్రత్యామ్నాయ గమ్యస్థానాలుగా మారుతున్నాయని అన్నారు. ‘నైపుణ్యం కలిగిన ప్రతిభ, మౌలిక సదుపాయాలు, అనుకూలమైన వ్యాపార వాతావరణాన్ని అందించడం ద్వారా హైదరాబాద్ ప్రత్యామ్నాయంగా మారుతోంది. ఇది ప్రపంచ సామర్థ్య కేంద్రాలకు ఆకర్షణీయమైన గమ్యస్థానంగా రూపుదిద్దుకుందని సేన్ వెల్లడించారు. అహుజా మాట్లాడుతూ, హైదరాబాద్ సరైన ప్రత్యామ్నాయంగా నిరూపించబడింది, ఇది పెరుగుతున్న కాస్మోపాలిటన్ నగరం గా మారడం వల్ల ఎక్కువ మంది ప్రజలు నగరానికి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు. తెలంగాణ రాజధాని నగరం సాంప్రదాయకంగా ఫార్మాస్యూటికల్ , లైఫ్ సైన్సెస్ ఎంటర్‌ప్రైజెస్ కేంద్రీకృతమై ఉంది. ఎవరెస్ట్ గ్రూప్ విశ్లేషకుల ప్రకారం, నగరం ఏరోస్పేస్, తయారీ, రిటైల్ సేవలు, ఫార్మాస్యూటికల్స్, ప్రొఫెషనల్ సర్వీసెస్ ఇండస్ట్రీ వర్టికల్స్ నుండి బహుళ ఫార్చ్యూన్ 500 దిగ్గజాలను కూడా ఆకర్షించింది. మరోవైపు బెంగళూరు స్టార్టప్ ఎకోసిస్టమ్‌కు ప్రసిద్ధిగా ఉన్నప్పటికీ టి-హబ్, జీనోమ్ వ్యాలీ కార్యక్రమాలు సహాయపడతాయని నిపుణులు అంటున్నారు.
ప్రతిభలోనూ పోటీ..
ప్రతిభ, జీతాల కోణంలో చూస్తే బెంగళూరు సంతృప్తికరంగా ఉంటుంది. ప్రతిభకు బెంగళూరు అనువైన ప్రదేశం అయితే, హైదరాబాద్ ఇక్కడ కూడా గట్టిపోటీ ఇస్తోంది. ఎవరెస్ట్ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, హైదరాబాద్ నగరం ప్రతిభ నాణ్యత, పరిమాణం రెండింటిలోనూ వృద్ధిని సాధించింది. ఐఎస్‌బి, ట్రిఫుల్ ఐటి, బిట్స్ పిలానీ వంటి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన సంస్థలను కలిగి ఉన్న విద్యా కేంద్రంగా దాని ప్రతిష్ఠ పెరిగింది. ఐటి, బయోటెక్నాలజీ, ఫార్మాస్యూటికల్స్, ఫైనాన్స్‌తో సహా వివిధ పరిశ్రమల వృద్ధికి ఈ నైపుణ్యం కలిగిన టాలెంట్ పూల్ దోహదపడింది. అదనంగా నైపుణ్యం అభివృద్ధిలో ప్రైవేట్ సంస్థలు, ప్రభుత్వం రెండూ కీలకపాత్ర పోషిస్తున్నాయి. దీంతో కంపెనీలకు హైదరాబాద్ మొదటి ఎంపికగా మారుతోంది. బెంగుళూరులో కేంద్రం ఏర్పాటు తర్వాత రెండో స్థానాన్ని ఏర్పాటు చేయడానికి పెద్ద సంస్థలకు హైదరాబాద్ తొలి ఎంపికగా మారుతోంది.
రాష్ట్ర ప్రభుత్వం కృషి
ఇవై సేన్ ప్రకారం, జిసిసిల విస్తరణను సులభతరం చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాల నిర్మాణంలో గణనీయమైన పెట్టుబడులు పెట్టింది. ఐటి మౌలిక సదుపాయాలు, టెక్ పార్క్‌లను ఏ ర్పాటు చేసింది. ఐటి ఆధారిత కంపెనీల అవసరాలను తీర్చేందుకు ఐటి మౌలిక సదుపాయాలు, టెక్ పార్క్‌లు, సెజ్‌లు(ప్రత్యేక ఎకనమిక్ జోన్)లను రాష్ట్రం వేగంగా విస్తరించింది. నైపుణ్యం, విద్యా సంస్థల్లో పెట్టుబడులు, భవిష్యత్ నైపుణ్యంపై శిక్షణ కార్యక్రమాలు రూపంలో నగరం గణనీయంగా కీలకపాత్ర పోషించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News