Sunday, December 22, 2024

‘మెకానిక్ రాకీ’లో చాలా సర్‌ప్రైజ్‌లు, ట్విస్ట్‌లు ఉంటాయి

- Advertisement -
- Advertisement -

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘మెకానిక్ రాకీ’. రవితేజ ముళ్లపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్స్ గా నటించారు. ఈ మూవీని ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామ్ తాళ్లూరి నిర్మించారు. ఈ చిత్రం శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ “మెకానిక్ రాకీ సినిమాలో నాది డిఫరెంట్ క్యారెక్టర్. ఇప్పటివరకూ చేయని విభిన్నమైన పాత్ర చేశాను. ఛాలెంజ్‌గా తీసుకొని ఈ సినిమా చేశాను.

మాయ క్యారెక్టర్‌ని చాలా ఎంజాయ్ చేస్తూ చేశాను. విశ్వక్‌తో కలసి నటించడంతో చాలా ఆనందంగా ఉంది. మెకానిక్ రాకీ జీవితంలో మాయ ఎలాంటి పాత్ర పోషిస్తుందనేది ఆసక్తికరంగా ఉంటుంది. ఆడియన్స్‌కి చాలా సర్‌ప్రైజ్‌లు, ట్విస్ట్‌లు ఉంటాయి. డైరెక్టర్ రవితేజ చాలా అద్భుతంగా తీశారు. -ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ చాలా గ్రాండ్‌గా ఈ సినిమాని తీశారు. జేక్స్ బిజోయ్ అద్భుతమై మ్యూజిక్ ఇచ్చారు. మెకానిక్ రాకీ సినిమా తర్వాత నాకు ఇంకా డిఫరెంట్ రోల్స్ వస్తాయని భావిస్తున్నాను. నేను చేసిన ‘డాకు మహారాజ్’ సినిమా సంక్రాంతికి వస్తోంది. తమిళ్‌లో ఓ వెబ్ సిరిస్ చేస్తున్నాను. విష్ణు విశాల్ తో ఓ సినిమా చేస్తున్నాను”అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News