Sunday, April 6, 2025

86మంది మావోల లొంగుబాటు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/భద్రాద్రి కొత్తగూడెం : కాలం చెల్లిన సిద్ధ్దాంతాలను వీడి జనజీవన స్రవంతిలో కలిసి ముందుకు వచ్చిన అంద రికీ పోలీసుల తరపున శుభాకాంక్షలు తెలుపుతున్నామని, ప్రజల్లోకి వస్తే తమ శాఖ తరపున సహాయ సహకారాలు అందిస్తామ ని మల్టీజోన్ 1 ఐజిపి రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. శనివారం భద్రా ద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం సమీపంలోని హేమచంద్రాపురం లో గల పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల స మావేశంలో ఆయన మాట్లాడుతూ… తెలంగాణ పోలీస్ శాఖ ఆ ధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల పోలీసులు, 181 బెటాలియన్, 141 బెటాలియన్, సిఆర్‌పిఎఫ్ అధికారులు ఆదివాసీ ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం నిర్వహిస్తున్న ఆపరేషన్ చేయూత కార్యక్రమం ద్వారా లొంగిపోయిన మావోయిస్టు సభ్యులకు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యం గురించి తెలుసుకొని హింసాత్మక నక్సలిజం మార్గాన్ని విడిచిపెట్టి ఇకపై తాము కూడా కుటుంబ సభ్యులతో కలిసి ప్రశాంతమైన జీవితం

గడపాలని నిర్ణయించుకొని వివిధ స్థాయిలలో పనిచేస్తున్న 86 మంది మావోయిస్టు సభ్యులు లొంగిపోయారని చెప్పారు. వీరిలో ఏరియా కమిటీ మెంబర్లు 4, పార్టీ కమిటీ మెంబర్ ఓఎస్ ఆర్‌పిసి 8, ఆర్‌పిసి మిలీషియా 27, ఆర్‌పిసి డికెఎఎంఎస్ 20, ఆర్‌పిసి ఎన్‌ఎం 13, ఆర్‌పిసి జిఆర్‌డి 9, మల్టీ జోన్ ఒకరు లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిశారని అన్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో నివసిస్తున్న వలస ఆదివాసీ ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం, జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో చేపడుతున్న వివిధ సంక్షేమ పథకాలు, కార్యక్రమాలకు ఆకర్షితులై పోలీసుల ఎదుట లొంగిపోవడం వల్ల కలిగే ప్రయోజనాలు, తద్వారా ప్రభుత్వం కల్పించే పథకాలతో లబ్ధి పొందాలని హితవు పలికారు. ఈ రెండు జిల్లాల్లో ఈ సంవత్సరం ఇప్పటివరకు 224 మంది లొంగిపోయారని, తెలిపారు. వారిలో డిసిఎం 2, ఏరియా కమిటీ మెంబర్లు 10, పార్టీ మెంబర్లు25, మిలీషియా మెంబర్లు 74, ఆర్‌పిసి మెంబర్లు 23, డిఎకెఎంఎస్ మెంబర్లు 41 మంది, సిఎన్‌ఎం మెంబర్లు 31 మంది, కొరియర్ 1, జిఆర్‌డి 17 మంది ఉన్నారని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్‌పి రోహిత్‌రాజు, ములుగు ఎఎస్‌పి, సిఆర్‌పిఎఫ్ కమాండెంట్‌లు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News