Wednesday, December 25, 2024

పోగొట్టుకున్న సెల్‌ఫోన్ అప్పగింత

- Advertisement -
- Advertisement -

శ్రీరాంపూర్ : శ్రీరాంపూర్ ఏరియాలో ఈ నెల 7న బాగం సతీష్ తన వన్‌ప్లస్ ఫోన్ పోయిందని శ్రీరాంపూర్ పోలీస్‌స్టేషన్‌లో పిర్యాదు చేయగా సీఈఐఆర్ పోర్టల్‌లో వివరాలు నమోదు చేసి పోయిన ఫోన్‌ను గుర్తించి మంగళవారం బాధితునికి ఎస్సై రాజేష్ అందజేశారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ ఎవరైనా తమ సెల్‌ఫోన్ పోగొట్టుకున్నా, దొంగతనానికి గురైనా అట్టి ఫోన్ వివరాలు సీఈఐఆర్ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు.

పోర్టల్ ద్వారా మొబైల్ తిరిగి పొందే అవకాశం ఉందని, దీనిని ప్రజలందరు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అదే విధంగా ఎవరికైనా మొబైల్‌ఫోన్‌లు, ఇతర వస్తువులు దొరికితే వాటిని సమీప పోలీస్‌స్టేషన్‌లో అప్పగించాలని, అంతే కాని వాటిని తమ వద్ద ఉంచుకోవడం నేరమని తెలిపారు. ఈ సందర్భంగా పోలీసులకు బాధితుడు కృతజ్ఞతలు తెలిపాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News