Thursday, January 23, 2025

గడ్చిరోలిలో లొంగిన నక్సల్ ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

Surrendered Naxal committed suicide in Gadchiroli

నాగ్‌పూర్ : మహారాష్ట్ర గడ్చిరోలి నగరంలో పోలీసులకు లొంగిపోయిన నక్సల్ తన ఇంటికి దగ్గర లోనే తనకు తాను ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 35 ఏళ్ల నక్సల్ గత ఏడాది భద్రతా బలగాలకు లొంగిపోయాడు. లొంగిపోయిన నక్సల్స్ కోసం నిర్మించిన కాలనీలో ఉంటున్నాడు. అయితే మంగళవారం తాను ఉంటున్న ఇంటికి సమీపాన ఉన్న చెట్టుకు ఉరిపోసుకుని చనిపోయాడని పోలీసులు బుధవారం వెల్లడించారు. కుటుంబ సమస్యలే దీనికి కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News