Saturday, January 4, 2025

తారక్క లొంగుబాటు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : మావోయిస్టు అగ్రనే త మల్లోజుల వేణుగోపాల్ సతీమణి తారక్క మహారా ష్ట్ర సిఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఎదుట లొంగిపోయారు. తారక్క అలియాస్ విమల సీదం ప్రస్తుతం మావోయి స్టు జోనల్ కమిటీ సభ్యురాలిగా ఉన్నారు. తారక్క భర్త మల్లోజుల వేణుగోపాల్ మావోయిస్టు కేంద్ర కమిటీ స భ్యుడిగా ఉన్నారు. మావోయిస్టు అగ్ర నేత కిషన్‌జీకి ఆ మె సమీప బంధువు. 1983లో మావోయిస్టు దళంలో చేరిన తారక్కపై నాలుగు రాష్ట్రాల్లో 170కి పైగా కేసులున్నాయి. ఆమెపై కోటికి పైగా రివార్డు ఉంది. బుధవారం గడ్చిరోలి జిల్లాలో సిఎం దేవేంద్ర ఫడ్నవీస్ పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలో సిఎం దేవేంద్ర ఫడ్నవీస్ సమీక్షంలో తారక్క

సహా మొత్తం 11 మంది మావోయిస్టులు లొంగిపోయారు. గడ్చిరోలిలో గతంలో మావోయిస్టుల ప్రాబల్యం అధికంగా ఉండేదని, అలాంటి ప్రాంతంలో పోలీసులు అవుట్ పోస్ట్ ఏర్పాటు చేశారని ఫడ్నవీస్ అన్నారు. గడ్చిరోలి ప్రాంతాన్ని చత్తీస్‌గడ్‌కు అనుసంధానం చేస్తూ రహదారిని అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. అలాగే మొబైల్ టవర్లు సైతం నిర్మిస్తున్నారని గుర్తు చేశారు. ఇక మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఇటీవల నాగపూర్‌లో ముగిశాయి. ఈ సమావేశాల్లో సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ గత ఏడాది 33 మంది మావోయిస్టులు ఎన్‌కౌంటర్‌లో మరణించారని చెప్పారు. ఇక గడ్చిరోలి జిల్లా ఉత్తర భాగం పూర్తిగా మావోయిస్టు రహిత ప్రాంతంగా మారిందని వివరించారు. అలాగే 55 మంది మావోయిస్టులను అరెస్ట్ చేయగా 33 మంది లొంగిపోయారని తెలిపారు.

మావోయిస్టులపై తమ ప్రభుత్వం పోరాటాన్ని కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ఇక వామపక్ష తీవ్రవాదాన్ని అణిచివేసేందుకు మూడేళ్ల కాలపరిమి విధించుకున్నామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. మరోవైపు గడ్చిరోలి ప్రాంతానికి చెందిన వందలాది యువత పోలీస్ శాఖలో చేరారన్నారు. వారిలో 33 మంది యువకులు మావోయిస్టులు బాధితులు ఉన్నారని వివరించారు. ఇక మావోయిస్టుల అగ్రనేతలు సైతం లొంగి పోయి జనజీవన స్రవంతిలో కలిశారన్నారు. 2026, మార్చి మాసాంతం నాటికి దేశంలో మావోయిస్టులను నిర్మూలించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకొంది. అందుకోసం తనదైన శైలిలో ముందుకు వెళ్తుంది. ఇప్పటికే దేశంలోని చాలా రాష్ట్రాల్లో మావోయిస్టుల ప్రభావం భాగా తగ్గిపోయింది. ఇంకా సోదాహరణగా చెప్పాలంటే తెలుగు రాష్ట్రాలు, జార్ఖండ్, బిహార్, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో వారి ప్రాబల్యం దాదాపుగా తుడిచి పెట్టుకుపోయింది. ఇక ఛత్తీస్‌గఢ్‌లో మాత్రం వారి ప్రాబల్యం కొంత స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో ఆ రాష్ట్రంలో సైతం భద్రత దళాలు, స్థానిక పోలీసుల సహయంలో కూబింగ్ తీవ్రతరం చేసింది.అందులోభాగంగా పలు ఎన్‌కౌంటర్లు సైతం చోటు చేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్లలో దాదాపు 27 మంది అగ్రనేతలు మరణించిన విషయం విధితమే. ఇక దేశంలో మావోయిస్టుల నిర్మూలన కోసం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఉన్నతాధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ కీలక సూచనలు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News