Monday, December 23, 2024

నేరస్థులపై నిఘా పెట్టాలి

- Advertisement -
- Advertisement -

రాచకొండలో నేరాల శాతం తగ్గింది
పోలీస్ ఉన్నతాధికారులతో రాచకొండ సిపి డిఎస్ చౌహాన్ సమావేశం

హైదరాబాద్: పాతనేరస్థులపై నిరంతరం నిఘా పెట్టాలని రాచకొండ పోలీస్ కమిషనర్ డిఎస్ చౌహాన్ అన్నారు. నేరెడ్‌మెట్‌లోని రాచకొండ పోలీస్ కమిషనరేట్‌లో మంగళవారం డిసిపిలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కమిషనరేట్ పరిధిలో జరిగే నేరాలను అరికట్టాని ఆదేశించారు. ప్రజలు ధైర్యంగా తిరిగేలా చూడాలని అన్నారు. నేరస్తులను పట్టుకోవడం, నేర పరిశోదనలో సాంకేతిక ఆధారాలను, సిసిటివిల కెమెరాలను ఉపయోగించుకోవాలని అన్నారు. అంతరాష్ట్ర దొంగల ముఠాలను వెంటాడి పట్టుకోవాలని ఆదేశించారు. పాతనేరస్థుల కదలికల మీద నిఘా వేసి ఉంచాలని, వారు మళ్లీ నేరాలకు పాల్పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు.

పోలీసులు తీసుకుంటున్న చర్యల వల్ల కమిషనరేట్‌లో చాలా వరకు నేరాలు తగ్గాయని తెలిపారు. నేరాల దర్యాప్తులో సివిల్, ట్రాఫిక్ వంటి అన్ని విభాగాలు, సాంకేతిక సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. నంబర్ ప్లేట్లు లేకుండా తిరుగుతున్న వాహనాల కోసం ప్రత్యేకంగా డ్రైవ్ నిర్వహించాలని, వాటి యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఉత్తమపనితీరు కనబర్చిన పోలీసులకు రివార్డులు ఇస్తామని తెలిపారు. కమిషనరేట్ పరిధిలో ఏర్పడిన నూతన పోలీస్ స్టేషన్లను త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు. సమావేశంలో జాయింట్ సిపి సత్యనారాయణ, డిసిపిలు గిరి జానకి, రాజేష్‌చంద్ర,సాయిశ్రీ, గిరిధర్, మురళీధర్, మధుకర్ స్వామి, శ్రీబాల,ఇదిరా, నర్మద, షమీర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News