Saturday, December 21, 2024

మావోయిస్టుల కదలికలపై నిఘా..

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/వెంకటాపూర్‌: మావోయిస్టు పీఎల్‌జీఏ వారోత్సవాల నేపథ్యంలో వారి ఉనికి కోసం ప్రజా జీవనానికి విఘాతం కలిగించే అవకాశాలుంటాయని ఎళ్ళవేళల అప్రమత్తంగా ఉండాలని వెంకటాపూర్ ఏస్సై తాజుద్దీన్ అన్నారు. ములుగు జిల్లా ఏస్పీ సంగ్రాంసింగ్ ఆదేశానుసారం, ములుగు ఏఏస్పీ నేతృత్వంలో వెంకటాపూర్ పోలీసులు మావొయిస్టుల కదలికలపై అప్రమత్తంగా ఉన్నామన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాత్రీ వేలల్లో గస్తీలు చేస్తు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటుంన్నామన్నారు. మావొయిస్టుల కదలికలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామన్నారు. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పీఎల్‌జీఏ) 22వ వారోత్సవం సందర్భంగా ఈనెల 2 నుండి 8 వరకు వారోత్సవాలు నిర్వహిస్తుందని, రాష్ట్రంలో మావొయిస్టులకు అనుకూలమైన అటవి ప్రాంతంలో ఒకటైన ములుగు జిల్లాలో కూడ ఉంది కనుక ములుగు జిల్లా పోలీసులు హై అలర్ట్‌లో ఉన్నారని అన్నారు.

ములుగు జిల్లాలోని ఏటూర్‌నాగారం, వెంకటాపూరం, వాజేడు, కన్నాయిగూడెం, అటవి ప్రాంతాలతో పాటు వెంకటాపూర్ మండలంలోని గుత్తికోయ గుంపులను జల్లేడ పడుతున్నట్లు ఆయన పేర్కోన్నారు. మావొయిస్టుల ఉనికిని చాటడం కోసం చాపకింద నీరులా వ్యాపించి ఉన్న ఉధ్యమాన్ని సాధ్యమైనంతగా నియంత్రించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు చేప్పారు. మావొయిస్టులకు సహకరించి కష్టాలను కొని తెచ్చుకోవద్దని ప్రజలకు సూచిస్తున్నట్లు పేర్కోన్నారు. కాలం చెల్లిన సిద్దాంతాలకు అకర్షనకు లోనై బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దన్నారు. మావొయిస్టులకు వ్యతిరేఖంగా మండల కేంద్రంతో పాటు వివిద గ్రామాల్లో వాల్‌పోస్టర్లును అంటించి వారిని పట్టించి పోలీసులకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News