Monday, December 23, 2024

సర్వేనెంబర్ 172 కోర్టు వివాదంలో ఉన్న భూమి పట్టాదారులదే

- Advertisement -
- Advertisement -

కూకట్‌పల్లి : కూకట్‌పల్లి సర్కిల్ హైదర్‌నగర్ డివిజన్‌లోని సర్వేనెంబర్ 172లోని 196.18 ఎకరాల భూమి ఆనాటి పట్టాదారులు వారి వద్ద కొనుగోలు చేసిన స్ధల యజమానులదేనని గురువారం భారత సర్వోన్నత న్యాయస్ధానం (సుప్రీంకోర్టు) తీర్పును వెలువరిచింది. ఈ సందర్భంగా త్రివేణి ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో సభ్యులు మాట్లాడుతూ గోల్డుస్టోన్ కెంపెనీ (ట్రినిటీ)తో గత 68 సంవత్సరాలుగా తమ భూవివాదం కొనసాగుతుందన్నారు. ఆ స్థ్ధలానికి చెందినది సెట్వినాబాద్ కాలనీ ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, శ్రీ సత్యసాయి సొసైటీ ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, జయానగర్ ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియెషన్, శ్రీసాయి గణేష్ ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ చెందిన సుమారు 2000పై చిలుకు యజమానులు కలిసికట్టుగా ఉంటూ ట్రివేణి ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్‌గా ఏర్పడి తమ స్థ్ధలాన్ని కాపాడుకునేందుకు ఎంతగానో పాటుపడ్డామన్నారు.

అయితే గత 15 రోజులుగా రోజు కొనసాగుతున్న వివాదానికి సుప్రీంకోర్టు జెస్టిస్ రామసుబ్రహ్మణ్యం, జస్టిస్ పంకజ్ మిట్టల్ ఆధ్వర్యంలో భూమి పట్టాదారులకు, వారి వద్ద కొనుగోలు చేసిన యజమానులకు వర్తింస్తుందని గురువారం తేల్చిచెప్పింది. అదే విధంగా హై కోర్టు డిక్రీ ద్వారా క్లేమ్ చేస్తూ వేసిన ఇంప్లీడ్ పిటిషన్, ప్రభుత్వం వేసిన మరో పిటిషన్, డిక్రీ ద్వారా క్లేమ్ చేస్తూ సమినా కౌసర్, హమీదున్నీసా బేగం, ఫరీదుద్దీన్ ఖాన్‌లు వేసిన పిటిషన్లను సైతం కోర్టు కొట్టివేసిందని తెలిపారు. న్యాయం , ధర్మం మరోమారు గెలిచాయని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. సెట్వినాబాద్ కాలనీ ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ విజయంలో కీలకంగా వ్యవహరించిందని తెలిపారు. అనంతరం స్వీట్లు తినిపించుకుంటూ సంబురాలు చేసుకున్న యజమానులు ఈ సందర్భంగా వారికి సహకరించిన స్థానిక ప్రజాప్రతినిధులకు, పోలీస్ శాఖ అధికారులకు సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలను తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News