Wednesday, January 22, 2025

సోలార్ పై పోస్టల్ శాఖ సర్వే

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ’ప్రధాన మంత్రి సూర్య ఘర్- ముఫ్త్ బిజిలీ యోజన పథకం’ అమలు కోసం పోస్టల్ శాఖ సర్వే నిర్వహిస్తున్నదని తపాలాశాఖ హైదరాబాద్ సౌత్ ఈస్ట్ డివిజన్ సీనియర్ సూపరింటెండెంట్ తెలిపారు. ఈ పథకం ద్వారా ఇండ్ల పైకప్పులపై సోలార్ పానెల్స్ ఏర్పాటు చేసుకునే అర్హులైన కోటి మంది లబ్దిదారులకు 300 యూనిట్ల వరకు ప్రతి నెల ఉచిత విద్యుత్ అందిస్తారని తెలిపారు.

సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు ఖర్చులో దాదాపు 40 శాతం వరకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ద్వారా అందిస్తుందని వివరించారు. ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలనుకునే వారి వివరాలను సేకరించేందుకు పోస్టల్ శాఖ చేస్తున్న సర్వేలో ఆసక్తి ఉన్నవారు తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు. సమీపంలోని పోస్ట్ ఆఫీస్ లేదా పోస్టుమ్యాన్‌ను సంప్రదించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News