Monday, December 23, 2024

జ్ఞానవాపి సర్వే.. ఈనెల 17 వరకు ఎఎస్‌ఐకి గడువు పెంపు

- Advertisement -
- Advertisement -

వారణాసి : జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్‌లో శాస్త్రీయ సర్వేను పూర్తి చేయడానికి వారణాసి కోర్టు గురువారం ఆర్కెయాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ( ఎఎస్‌ఐ)కు ఈనెల 17 వరకు గడువు పెంచింది. ఎఎస్‌ఐ అభ్యర్థనపై జిల్లా జడ్జి ఎకె విశ్వేష్ ఈమేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఎఎస్‌ఐ తన సర్వేను పూర్తి చేసిందని, కానీ సర్వేపనికి ఉపయోగించిన సౌకర్యాలు తదితర పూర్తివివరాలు నివేదికలో పొందుపర్చడానికి మరింత గడువు కావాలని అభ్యర్థించడంతో గడువు పొడిగించడమైందని కేంద్ర ప్రభుత్వ న్యాయవాది అమిత్ శ్రీవాత్సవ వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News