Monday, January 20, 2025

పంట నష్టంపై రైతు వారీ సర్వే…

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : ఇటీవలి అకాల వర్షాలతో సంభవించిన పంట నష్టంపై గురువా రం నుంచి రైతు వారీగా సర్వే చేయాలని వ్యవ సా యశాఖ కార్యదర్శిని ఆదేశించినట్లు రాష్ట్ర వ్యవ సా యశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రక టిం చారు. సాధ్యమైనంత త్వరలో నివేదిక సమర్పించాలని కోరినట్లు తెలియజేశారు. నివేదిక అం దిన వెంటనే సిఎం ఆదేశానుసారం నష్టపోయి న ప్రతి ఒక్క రైతుని ఆదుకోవడం జరుగుతుందని మంత్రి తుమ్మల రైతులకు భరోసా ఇచ్చారు.ఆకాల వర్షా లు ప్రకృతి వైపరీత్యాలతో పంటలు నష్టపోయన ప్రతి రైతును ఆదుకునేందుకు ప్రభు త్వం సిద్దంగా ఉన్నట్టు మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. బిఆర్‌ఎస్ నాయకుల మాటలు నేతి బీరకాయలోని నేతి చందంగా ఉన్నాయన్నారు. గత పది సంవత్సరాల లో ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోయిన అ నేక సందర్భాల లో కేవలం ఎన్నికల సంవత్సరం లో ఎకరానికి రూ.10వేల పరిహారం ప్రకటించి హ డావుడి చేసి కే వలం 150 కోట్లు మాత్రమే విడుద ల చేసారన్నా రు.

తదనంతరం 350 కోట్లకి ఉతర్వూలు జారీచేసి పరిహారం అందించిన పాపాన పోలేదన్నారు. అదే విధంగా అదే నెలలో అకాల వర్షాలతో మరో మారు 1,25,వేల ఎకరాల్లో పం ట నష్టం సం భవించినప్పటికీ పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు.గోదావరి వరదలు వచ్చిన సందర్భంగా 100కు 100% పంటలు నష్టపోయి ఇసు క మేట లు వేసిన సందర్భంలో అప్పటి బిఆర్‌ఎస్ ప్రభుత్వంలోని నాయకులు ఏ ఒక్కరూ పట్టించుకోలేదన్నారు. రుణ మాఫీ అమలు చేస్తామని గొప్ప గా చె ప్పుకున్న బిఆర్‌ఎస్ నాయకులు మొదటి వి డత మాఫీని విడతకు 25వేల చొప్పున నాలుగు వి డతలగా ఇవ్వడంతో ఆ మొత్తం అసలుకు బదులు వ డ్డీ జమైన సందర్భం ప్రతి ఒక్క రైతుకి అనుభవమేనని తెలిపారు. 2018లో ప్రకటించిన రెండవ వి డత రుణమాఫీ రూ.19,600 కోట్లకు గాను, కే వలం రూ. 9500 కోట్లు విడుదల చేసి మమ అనిపించారని, ఆ నాయకులు ఈ రోజు ముసలి కన్నీ ళ్ళు పెడుతున్నారని విమర్శించారు.

రైతు బంధువిషయంలో మే నెల వరకు రైతులకు గతంలో జమ చేసిన సందర్బాలు మర్చిపోయి, ఇప్పుడు మా ర్చి నెల లోనే పథకం అమలు చేయలేదని గ గ్గోలు పెడ్తున్న బిఆర్‌ఎస్ నాయకులకు ఈ ప్రభు త్వ చిత్తశుద్దిని ప్రశ్నించే అధికారం లేదన్నారు. గత ప్రభుత్వ పాపాల వల్ల ఖాళీ అయిన ప్రభుత్వ ఖజనాని క్రమశిక్షణ చర్యల ద్వారా ప్రభుత్వాన్ని న డుపుతూ జమ అవుతున్న నిధుల నుంచి అధిక భాగం రైతు బంధుకు వేచ్చిస్తున్నామని తెలిపారు. గతంలో బిఆర్‌ఎస్ పార్టీ అధికారంలో ఉండగా ఏనాడూ రైతు కష్టాలను పట్టించుకోని అప్పటి ప్రభుత్వం గొప్పలకి పోయి నీళ్ళు అవసరంలేని సందర్భాలలో కూడా కాలువలకు నీళ్ళు విడుదల చేసి నీరు వృధా చేయడం జరిగిందన్నారు. నాగార్జునసాగర్ ఆయకట్టు కింద మొదటి పంటకే నీళ్ళు ఇవ్వని దుస్థితికి తెచ్చారని ఆరోపించారు. విద్యుత్ ఉత్పత్తిని ప్రణాళిక ప్రకారం చేయకుండా నీటిని విడుదల చేసి సముద్రంలో

కలిపి నాగార్జునసాగర్ రిజర్వాయ ను ఖాళీ చేసిన పాపం అప్పటి బిఆర్‌ఎస్ ప్రభుత్వానిదే అన్నారు.కాంగ్రెస్ ఎప్పటికీ రైతుల పక్షపాత ప్రభుత్వమేనని వెల్లడించారు. రెండు మూడు రోజులుగా కురిసిన వర్షo వల్ల జరిగిన పంట నష్టాలకు సంబంధించిన వివరాలతో కూడిన నివేదికను ముఖ్యమంత్రి తో సమావేశమై సిఎం దృష్టికి తీసుకు వెళ్లినట్టు తెలిపారు అదేవిధంగా ఈ ప్రభుత్వం రైతులను కష్టకాలంలో ఆదుకునేందుకు ఎప్పుడు సిద్దంగా ఉంటుందన్నారు. ఎన్నికల కోసం లేదా రాజకీయాల కోసం ఉత్తుత్తి మాటలు ఉత్తుత్తి పథకాలు ప్రకటించదని స్పష్టం చేశారు. అప్పటి ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన నేటి మాజీ మంత్రులు తెలుసుకోవాలని, ఇకనైనా వారు ప్రేలాపనలు మానుకోవల్సిందిగా మంత్రి సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News