Friday, December 20, 2024

జీవవైవిధ్య పరిరక్షణే జీవకోటికి రక్షణ!

- Advertisement -
- Advertisement -

కొన్ని బిలియన్ ఏండ్లకు పూర్వమే ఏర్పడిన భూగోళం పై నివసిస్తున్న 8 మిలియన్ల జీవరాసుల (వృక్షాలు, జంతువులు, ఫంగీ, బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మ జీవులు) మనుగడకు భంగం కలుగకుండా పరిరక్షించుకుంటూ, పర్యావరణ (అడవులు, ఎడారులు, చిత్త డి నేలలు, పర్వతాలు, సరస్సులు, నదులు, చెరువులు, వ్యవసాయ భూములు) సమతుల్యతను సమర్థిస్తూ, మానవ మనుగడ సాగించడమే జీవవైవిధ్యం గా అర్థం చేసుకోవాలి. సుస్థిర వ్యవసాయం, ఎడారీకరణ, నేల క్షీణత, మహాసముద్రాలు, గిరిజన జాతు లు, ఆహార భద్రత, కరువులు, నీరు లభ్యత, పారిశుద్ధ్యం, ఆరోగ్యం, అంటువ్యాధులు, జీవనోపాధి, సుస్థిరాభివృద్ధి, శక్తి వనరులు, శాస్త్రసాంకేతికత, సృజనశీలత, విజ్ఞాన వినిమయం, పట్టణీకరణ, రవాణా, వాతావరణ మార్పులు, విపత్తు నిర్వహణ, అడవులు, పేదరికం లాంటి అనేక అంశాలు జీవవైవిధ్యం మీద నే ఆధారపడి ఉంటాయి.

ఐరాస నిర్దేశించిన ‘సుస్థిరాభివృద్ధి లక్ష్యాల’లో జీవ వైవిధ్యానికి పెద్ద పీట వేయడం జరిగింది. 1993 ఐరాస జనరల్ అసెంబ్లీ తీర్మానం ప్రకారం జీవ వైవిధ్య ప్రాధాన్యతను గుర్తించి ప్రతి ఏటా 29 డిసెంబర్ రోజున ప్రత్యేక అవగాహన కల్పించేందుకు ‘అంతర్జాతీయ జీవవైవిధ్య దినం’ జరుపుకోవడం జరిగిం ది. 22 మే 1992 రోజున జరిగిన ‘రియో ఎర్థ్ సమ్మిట్’కు గుర్తుగా 22 మే రోజున జరుపుకోవాలని 20 డిసెంబర్ 2000 రోజున ఐరాస మరో నిర్ణయం తీసుకోవడం జరిగింది.అంతర్జాతీయ జీవవైవిధ్య దినం – 2023 నినాదంగా ‘ఫ్రం అగ్రిమెంట్ టు ఆక్షన్: బిల్ బ్యాక్ బయోడైవర్సిటీ’ అనే అంశాన్ని తీసుకోవడం జరిగింది. జీవవైవిధ్యానికి విఘాతం కలగడంతో మానవ జాతి ప్రతి 4 మాసాలకు ఒక నూతన కరోనా లాంటి విపత్తు లేదా అంటువ్యాధికి లోనవడం జరుగుతున్నది.
ప్రపంచంలో 3 బిలియన్ల జీవులు జలాల్లో 1.6 బిలియన్ జీవరాసులు అడవుల్లో మనుగడ సాగిస్తున్నా యి. సకల జీవుల మనుగడకు రక్షణ కలగాలన్నా, కరోనా లాంటి మహమ్మారుల ద్వారా సోకే అంటువ్యాధులను నియంత్రించాలన్నా జీవ వైవిధ్య పరిరక్షణ చర్యలు విధిగా జరగాల్సిందే. జీవ వైవిధ్యాన్ని విచ్ఛిన్నం చేస్తే 70 శాతం వరకు జంతు సంబంధ జునోటిక్ వ్యాధులు ప్రబలుతాయని తెలుసుకోవాలి. ప్రకృతిలో సహజ సిద్ధం గా మనుగడ సాగిస్తున్న వృక్ష, జంతుజాల సమతుల్యతకు భంగం కలిగించే ఎలాంటి చర్యలు చేయరాదు. మానవ అకారణ, అనాలోచిత క్రియలతో కొన్ని జీవరాసులు అంతరించిన యెడల వాటిపై ఆధారపడే వ్యాధికారక సూక్ష్మ క్రిములు మనవాళికి సోకడంతో భయంకర అంటురోగాలు కలుగుతాయి.జీవవైవిధ్యం విచ్ఛిన్నమైతే వాతావరణ ప్రతికూల మార్పులు కూడా కలుగుతాయి.
ప్రపంచ వ్యాప్తంగా ప్రతి గంటకు కనీసం 3 జీవ జాతులు, రోజుకు 100 – 150, ఏడాదికి 15,000 18,000 జీవజాతులు అంతరిస్తున్నాయని తేలింది. బీడు భూములు పెరగడంతో 74 రకాల కప్ప జాతు లు, ధ్రువాల వద్ద మంచు కరగడంతో 22 శాతం పోలార్ బేర్‌లు, అంటార్కిటికాలో ఉష్ణోగ్రతలు పెరగడంతో పెంగ్విన్‌లు, నెథర్‌లాండ్‌లో వాతావరణ మార్పులతో ఫ్లైకాచర్ పక్షులు లాంటి అనేక జీవ జాతులు అంతరించే సమయం ఆసన్నమైందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. యునెస్కో సూచనల ప్రకారం మానవ జాతికి, సహజ ప్రకృతికి సంబంధాన్ని స్థాపించడానికి పర్యావరణ పరిరక్షణ జరగాలి. పర్యావరణ సమతుల్యతకు బాట లు వేయడం, జీవవైవిధ్య పరిరక్షణకు యువశక్తిని వినియోగించడం జరగాలి. ఈక్రమంలో 1,121 ప్రపంచ వారసత్వ క్షేత్రాలు (వరల్డ్ హెరిటేజ్ సైట్స్), 714 జీవావరణ నిల్వలు (బయోస్పియర్ రిజర్వ్), 161 గ్లోబల్ జియో పార్కులు ఏర్పాటు చేస్తూ, 6 శాతం నేలను పరిరక్షించడం జరుగుతున్నది.

అడవులను నరికివేయడం, వన్యప్రాణుల్ని వేటాడడం, శిలాజ ఇంధనాలను వినియోగించడం, గాలి / నేల/నీటి కాలుష్యాలకు కారణం కావడం, ప్లాస్టిక్‌ను వినియోగించడం, విచక్షణారహితంగా రసాయన ఎరువులు/ పురుగు మందులు వాడడం, ఆహారం /నీటిని దుర్వినియోగం చేయడం లాంటి అనేక మానవ క్రియ లు జీవ వైవిధ్యానికి ప్రతిబంధకాలని తెలుసుకోవాలి. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ, సకల జీవరాశులను రక్షించుకుంటూ, జీవ వైవిధ్యాన్ని కాపాడుకుందాం. జీవ వైవిధ్య సంపదలతో విరబూసే ధరణి మానవ నివాసానికి, భూగ్రహ స్థిరత్వానికి పునాది అవుతుంది.

జీవ వైవిధ్య విఘాత సృష్టి కర్త మనిషే కాబట్టి మానవుడే దాని పరిరక్షణకు సమాధానం కూడా కావాలి. సమస్యకు కారణమైన వారే సమాధానం కూడా అందించాలి. ప్రకృతిలోని జీవులు అంతరించే దుస్థితి ఏర్పడితే, తిరిగి పూర్వపు స్థితికి రావడం వీలుకాదు. పరిస్థితులు మరింత చేయి దాటక ముందే జీవ వైవిధ్యాన్ని పరిరక్షించే సత్కార్యాలు చేయటానికి విశ్వమానవాళి, ముఖ్యంగా యువత నడుం బిగించాలి. ఇలాగే మరి కొంత సమ యం నిర్లక్ష్యం చేస్తే ప్రపంచ మానవాళి భారీ మూల్యమే చెల్లించాల్సి ఉంటుందని తెలుసుకోవాలి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News