Friday, September 20, 2024

యూనిక్ కాన్సెప్ట్‌తో…

- Advertisement -
- Advertisement -

గౌతమ్ హీరోగా ఎస్ ఒరిజినల్స్ పతాకంపై యూనిక్ కాన్సెప్ట్‌తో సృజన్ యరబోలు ఓ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ మూవీతో సుబ్బు చెరుకూరి దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఈ మూవీ సర్వైవల్ థ్రిల్లర్ అనే కొత్త కాన్సెప్ట్‌ను తెర మీద పరిచయం చేయబోతోంది. మోనోఫోబియాతో బాధపడుతున్న ఒక అప్‌కమింగ్ రచయిత తన జీవితానికి ప్రమాదం ఏర్పడినప్పుడు ఎలా దాని నుంచి బయటపడ్డాడు అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కనుంది. శ్రీరామ్ మడ్డూరి సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రానికి కె.సంతోష్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. మోహన్ చారి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News