- Advertisement -
స్టార్ హీరో సూర్య 18 సంవత్సరాల తర్వాత మళ్ళీ తన డైరెక్టర్ బాలతో కలిసి పని చేస్తున్నారు. పూజ కార్యక్రమాలు నిర్వహించుకున్న ‘సూర్య41’వ చిత్రం రెగ్యులర్ షూటింగ్ కన్యాకుమారిలో సోమవారం ప్రారంభమైంది. వీరు ఇరువురు కలిసి చేసిన చివరి చిత్రం ‘శివపుత్రుడు’ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ కావడం, ఈ చిత్రంలో సూర్య పాత్రకి తెలుగు ,తమిళంలో మంచి పేరు రావడంతో ప్రేక్షకులలో ఈ కలయికపై మరిన్ని అంచనాలు పెరగనున్నాయి. 2డి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో తెరకెక్కే ఈ చిత్రానికి సూర్య, జ్యోతిక నిర్మాతలుగా, రాజశేఖర పాండియన్ సహ నిర్మాతగా వ్యవహరించనున్నారు. కృతి శెట్టి హీరోయిన్‌గా నటించే ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించనున్నారు..బాల సుబ్రమణియం సినిమాటోగ్రాఫర్ గా చేస్తున్నారు.
- Advertisement -